Begin typing your search above and press return to search.
రెమ్యూనరేషన్స్ తగ్గించే ప్రసక్తే లేదంటున్న ఆర్టిస్టులు - టెక్నీషియన్లు...!
By: Tupaki Desk | 8 Oct 2020 3:30 PM GMTకరోనా క్రైసిస్ కష్టాల నుంచి నిర్మాతలను గట్టెక్కించడానికి నటీనటులు సాంకేతిక నిపుణుల పారితోషికాల విషయంలో యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పారితోషకాల్లో కోతలు విధిస్తున్నామని.. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ లో 20 శాతం కోత ఉంటుందని గిల్డ్ ప్రకటించింది. రోజుకు రూ. 20 వేలకు పైగా పారితోషికం తీసుకునే నటీనటులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని.. అలాగే 5 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే టెక్నీషియన్లకు కూడా ఇది వర్తిస్తుందని గిల్డ్ ప్రకటించింది. అయితే రోజుకు రూ.20 వేల లోపు తీసుకునే వారి పారితోషికాలు యథాతథంగా ఉంటాయని తెలిపింది. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)తో ఒప్పందం కుదిరిందని.. పారితోషకాల తగ్గింపు నిర్ణయానికి సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ కోరింది. అయితే ఇండస్ట్రీలోని కొందరు స్టార్ హీరోలు డైరెక్టర్స్ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి సిద్ధపడటం లేదని తెలుస్తోంది.
కరోనా లాక్ డౌన్ కి ముందే టాలీవుడ్ లో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. అయితే కోవిడ్-19 రాకతో సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మూడు నెలల క్రితమే షూటింగులకు అనుమతి లభించినప్పటికీ స్టార్ హీరోలు ఎవరూ షూటింగ్ చేయడానికి ధైర్యం చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్తున్నాయి. థియేటర్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతుండటంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అందులోనూ రెమ్యూనరేషన్స్ లో 20 శాతం కట్టింగ్స్ ఉండటంతో అంతో ఇంతో బయటపడొచ్చని అనుకున్నారు. అయితే టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోలు - హీరోయిన్స్ - సీనియర్ నటీనటులు - స్టార్ డైరెక్టర్స్ - కొందరు యువ హీరోలు ఈ ప్రపోజల్ కి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అగ్రిమెంట్ చేసుకున్నంత ఇస్తేనే ముందుకు వెళ్లేది అంటూ సదరు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తమ నిర్మాతలకు తేల్చిచెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ప్రాఫిట్ షేరింగ్ తో సినిమాలు చేస్తున్న హీరోలు దర్శకులు మాత్రం షూటింగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్నామని.. సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చే వరకు నిర్మాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత వీరికి లేదా అని సదరు ప్రొడ్యూసర్స్ డిస్కషన్ చేసుకుంటున్నారని తెలిసింది.