Begin typing your search above and press return to search.
టాలీవుడ్ హీరోలు ఎవరెవరు ఎప్పుడు షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారంటే...?
By: Tupaki Desk | 28 Jun 2020 6:30 AM GMTటాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి... ముందుగా ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.. ఏ స్టార్ హీరో మొదట మేకప్ వేసుకుంటాడు.. పెద్ద సినిమాల షూటింగ్స్ పరిస్థితి ఏంటి.. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. అని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు. నిజానికి అసలు టాలీవుడ్ లో సినిమా షూటింగ్ ల సందడి ఇప్పుడప్పుడే మొదలవుతుందా అనే ప్రశ్న వారి మనసుల్లో తలెత్తుతోంది. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతించడంతో అర్థాంతరంగా ఆగిపోయిన సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయాలని భావించారు. అయితే కరోనా రోజురోజుకి విజృభిస్తుండటంతో ఎవరూ రిస్క్ తీసుకొని షూటింగ్ ప్రారంభించడానికి ముందుకు రాలేదు. ఒకటి అర చిన్న సినిమాలు స్టార్ట్ అయ్యాయి కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కరోనా కలకలం రేపుతుండటంతో వాటి షూటింగ్స్ కూడా నిలిపేసే ఆలోచనలో ఉన్నారట. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యుయేషన్ ప్రకారం టాలీవుడ్ హీరోలు ఎప్పటి నుండి షూటింగ్స్ లో పాల్గొనాలి అనే విషయంపై ఓ క్లారిటీకి వచ్చేసారట. దీనిపై ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ తో కూడా చెప్పేశారట.
టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి - నాగార్జున - బాలయ్యలు ఇప్పట్లో షూటింగులో పాల్గొనలేమని చెప్పేస్తున్నారట. అందులోనూ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వయసు పైబడిన వారు షూటింగ్స్ లో పాల్గొనడానికి అనుమతి లేదు. దీంతో వీరి సినిమాలు మరికొన్ని రోజులు లేట్ గా స్టార్ట్ కానున్నాయి. ఆ కోవకే చెందిన వెంకటేష్ సెప్టెంబర్ నుండి చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పాడట. అయితే డిసెంబర్ నాటికి వెంకీ కూడా షష్టిపూర్తి హీరోల్లో చేరిపోతారు. దీంతో వెంకటేష్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం కష్టమే. ఇక స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' సినిమా ఫైనల్ స్టేజీలో ఉండటంతో చిత్రీకరణలో పాల్గొని వీలైనంత త్వరగా సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యారట. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం సెట్స్ పై వెళ్ళడానికి వెనుకంజ వేస్తున్నారట. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' పది రోజుల షూటింగే బ్యాలన్స్ ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే షూటింగ్స్ స్టార్ట్ చేద్దామని నిర్మాతలకి చెప్తున్నాడట.
సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం డిసెంబర్ నుంచి 'సర్కారు వారి పాట' షూటింగ్ లో పాల్గొనడానికి రెడీగా ఉన్నానని చెప్పాడట. ఇక అల్లు అర్జున్ 'పుష్ప' కోసం సెప్టెంబర్ నుంచి షూట్ కి వస్తానని.. కాకపోతే ఇండోర్ షూటింగ్స్ మాత్రమే అని కండిషన్ పెట్టేసాడట. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'లో నటిస్తున్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు వాక్సిన్ వచ్చాకే చిత్రీకరణలో పాల్గొంటామని క్లారిటీ ఇచ్చేసారట. ఇప్పటికే ట్రయిల్ షూట్ ప్రాక్టీస్ సెషన్ కి వెళ్లిన వీరిద్దరూ కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండటంతో ఇంటికే పరిమతమవ్వాలని డిసైడ్ అయ్యారట. నాని కూడా వాక్సిన్ వచ్చాకే వస్తానని ప్రొడ్యూసర్స్ తో చెప్పేశారట. ఇక విజయ్ దేవరకొండ సెప్టెంబర్ నుంచి అయితే రెడీగా ఉంటానని అంటున్నాడట. దగ్గుబాటి రానా ఆగస్టులో పెళ్లి వేడుక కంప్లీట్ అయ్యాక వీలు చూసుకొని షూటింగ్స్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాడట. వరుణ్ తేజ్ - నిఖిల్ సిద్దార్థ్ లు రెడీగా ఉన్నా ప్రొడ్యూసర్స్ మాత్రం రెడీగా లేరంట.
అక్కినేని హీరోలు నాగచైతన్య - అఖిల్ - సుశాంత్ కరోనా వ్యాక్సిన్ వచ్చిన తరువాత మాత్రమే సెట్స్ లో అడుగుపెడతామని క్లియర్ గా చెప్పేశారట. నాగ శౌర్య - రాజ్ తరుణ్ ల సినిమాలు అన్నీ ప్రస్తుతానికి హోల్డ్ లో ఉన్నాయట. మంచు హీరోలు విష్ణు - మనోజ్ లు ఆగస్టులో పరిస్థితులను బట్టి సెట్స్ లో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇక రామ్ 'రెడ్'.. సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'.. సుధీర్ బాబు 'వి' సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పడప్పుడే హీరోలు షూటింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదనేది స్పష్టం అవుతోంది.