Begin typing your search above and press return to search.

ఆచార్య అధికార పార్టీల మనోభావాలు దెబ్బతీస్తాడా ఏంటీ?

By:  Tupaki Desk   |   18 July 2021 12:30 PM GMT
ఆచార్య అధికార పార్టీల మనోభావాలు దెబ్బతీస్తాడా ఏంటీ?
X
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది. ఒకటి రెండు రోజుల్లో గుమ్మడి కాయ కొట్టడం కన్ఫర్మ్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ సమయంలో ఆచార్య సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ఆసక్తికర వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వార్త అనుసారంగా ఆచార్య సినిమాలో పొలిటికల్‌ డైలాగ్స్‌ చాలా పవర్‌ ఫుల్ గా ఉంటాయని అంటున్నారు. అంటే సినిమాలో కొందరు అధికార పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి మరియు ఇతర కార్యక్రమాల వల్ల జనాలు ఏ విధంగా నష్టపోతున్నారు.. ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులు ద్వంసం అవుతున్నాయి అనే విషయాలను లేవనెత్తుతూ డైలాగ్స్ ఉంటాయట.

మెగా స్టార్‌ చిరంజీవి చెప్పే ఆ  డైలాగ్స్ తో అభిమానులకు పూనకాలే అంటూ యూనిట్‌ సభ్యులు అనధికారికంగా మీడియాకు హిట్ ఇస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం సినిమాలో పొలిటికల్‌ సెటైరికల్ డైలాగ్స్ చాలానే ఉంటాయని తద్వారా ఈ సినిమా తో చిరంజీవి పొలిటికల్‌ తేనె తుట్టెను తట్టినవాడు అవుతాడేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్య కాలంలో సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు తమకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా కొందరు కావాలని మీడియా ముందుకు వచ్చి తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ విమర్శించడం చూస్తూ ఉన్నాం.

ఇలాంటి సమయంలో చిరంజీవి పొలిటికల్‌ డైలాగ్స్ పేల్చితే ఎవరి మనోభావాలు దెబ్బ తింటాయో అంటూ ఇప్పటి నుండే మెగా ఫ్యాన్స్ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ సినిమాలను చేస్తాడు అనడంలో సందేహం లేదు. అలాంటి కొరటాల శివ సొసైటీపై సున్నితంగా విమర్శలు కూడా చేయడం మనం గత చిత్రాల్లో చూశాం. కనుక ఆయన నుండి ఆచార్య ద్వారా కూడా మంచి మెసేజ్ ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. మెసేజ్ లు ఇవ్వాలంటే పొలిటికల్‌ స్పీచ్ లు దంచాల్సి ఉంటుంది. అలాంటి పొలిటికల్‌ స్పీచ్ ల వల్ల అధికార పార్టీలే కాకుండా ఇతర పార్టీల మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే చాలా వరకు ఈమద్య కాలంలో స్టార్ హీరోలు పొలిటికల్‌ డ్రామాలు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

చిరంజీవి ఖచ్చితంగా ఎవరిని విమర్శించకుండానే సినిమా చేసి ఉంటాడు అని కొందరి నమ్మకం. మరి ఆచార్య మనోభావాలను దెబ్బ తీస్తాడా లేదంటే అందరికి సున్నితంగా మంచి మెసేజ్‌ ఇస్తాడా అనేది చూడాలి. ఇక ఆచార్య విషయానికి వస్తే చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లు నక్స లైట్స్‌ గా కనిపించబోతున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించగా.. చరణ్‌ కు జోడీగా పూజా హెగ్డే ఉంటుందట. చరణ్ పాత్ర కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా సినిమాకు అత్యంత కీలకమైన పాత్రగా చెబుతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి మరియు చరణ్‌ లు కలిసి నటిస్తున్న మూవీ అవ్వడంతో అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి. వందల కోట్ల బిజినెస్ అవ్వడంతో పాటు వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డును సృష్టిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. మే లో విడుదల అవ్వాల్సిన ఆచార్య కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి ఈ సినిమా షూటింగ్‌ ను ముగించిన వెంటనే లూసీఫర్‌ మరియు వేదాళం సినిమా ల రీమేక్‌ ల్లో జాయిన్‌ అవ్వబోతున్నాడు. బాబీతో కూడా చిరు మూవీ ఉన్న విషయం తెల్సిందే.