Begin typing your search above and press return to search.

కీర‌వాణి స‌క్సెస్ ని ఓర్వ‌లేక‌నే ఇదంతా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   17 Jan 2023 6:31 AM GMT
కీర‌వాణి స‌క్సెస్ ని ఓర్వ‌లేక‌నే ఇదంతా చేస్తున్నారా?
X
జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా సంచ‌ల‌నం 'RRR'. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిఇస న‌టించిన మూవీ ఇది. అంతే కాకుండా ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేప‌థ్యంలో ఇద్దరు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ ఫిక్ష‌న‌ల్ స్టోరీగా ఈ మూవీని తెర‌కెక్కించారు. రాజ‌మౌళి టేకింగ్‌, దాన‌య్య మేకింగ్‌, ఇద్ద‌రు హీరోల ట్రెమండ‌స్ పెర్ఫార్మెన్స్ కార‌ణంగా ఈ మూవీకి గ్లోబ‌ల్ గా మంచి గుర్తింపు ల‌భించింది.

అదే ఈ మూవీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని అందించింది. 'నాటు నాటు' సాంగ్‌ కు గానూ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో అవార్డుని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల్లోనూ 'RRR' రెండు విభాగాల్లో అవార్డుల్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇదిలా వుంటే గోల్డెన్ గ్లోబ్ స‌హా నాలుగు అంత‌ర్జాతీయ అవార్డుల్ని 'RRR' ద‌క్కించుకుంది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించిన కీర‌వాణి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా రామోజీ గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

త‌న సంగీతం తెలుగు రాష్ట్రాలు దాటించ‌డంతో పాటు కెరీర్ లో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకునేందుకు రామోజీరావు త‌న‌కు అండ‌గా నిలిచార‌ని పేర్కొన్నారు. త‌నకు మార్గ‌ద‌ర్శ‌కులుగా నిలిచిన బాల‌చంద‌ర్‌, భ‌ర‌త‌న్‌, అర్జున్ భ‌ట్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే ఈ స్టేట్ మెంట్ పై కొంత మంది నెటిజ‌న్ లు నానా అర్థాలు తీస్తూ కామెంట్ లు చేస్తున్నారు. ఇందులో విచిత్రం ఏమి క‌నిపించిందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. తొలి అవ‌కాశం ఇచ్చిన వారిని ఉన్న‌త శిఖ‌రాలు అధిరోమించిన క్ర‌మంలో గుర్తు చేసుకోవ‌డం క‌నీస బాధ్య‌త కీర‌వాణి చేసిందీ అదే.

ఆయ‌న‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అవ‌కాశాన్ని 'మ‌న‌సు మ‌మ‌త‌' సినిమాకు గానూ రామోజీరావు అవ‌కాశం ఇచ్చారు. ఇది 1990లో విడుద‌లైంది. మంచి విజ‌యాన్ని సాధించిన కీర‌వాణికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ త‌రువాత ఇదే సంస్థ‌లో కీర‌వాణి మూడు సినిమాలు ఒకే ఏడాది చేశారు. అవి కూడా స‌క్సెస్ కావ‌డంతో ఆయ‌న ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇంతింతై వ‌టుడింత‌తై అన్న‌ట్టుగా చిన్న సినిమాతో మొద‌లైన త‌న ప్ర‌యాణం గోల్డెన్ గ్లోబ్ వ‌ర‌కు చేరింద‌ని సింబాలిక్ గా కీర‌వాణి ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఇది చాలా స‌హ‌జం. కృత‌జ్ఞ‌త వున్న వాళ్లు మాత్ర‌మే ఇలా చేస్తారు. తొలి నాళ్ల‌లో మ‌న‌కు అవ‌కాశం ఎవ‌రిచ్చారో ఉన్న‌త శిఖరాలు అధిరోహించిన క్ర‌మంలో గుర్తు చేసుకోవ‌డం అన్న‌ది అత్యంత స‌హ‌జం. దానికే పెడ‌ర్థాలు తీస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంత మంది త‌మ ఓర్వ‌లేని త‌నాన్ని చూపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నార‌ని కొంత మంది నెటిజ‌న్ ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు సినిమాకు ప్ర‌పంచ ఖ్యాతి ద‌క్కిన వేళ ఇలాంటి చ‌వ‌క బారు విమ‌ర్శ‌ల‌తో ఆ సెల‌బ్రేష‌న్స్ ని నీరుగార్చే విధంగా కొంత మంది నెటిజ‌న్ లు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు నీచ‌మ‌ని కూడా కొంత మంది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.. సాధార‌ణ సినీ ల‌వ‌ర్స్ ఘాటుగానే స్పందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.