Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలోని కొందరు సినిమాల విడుదలను అడ్డుకుంటున్నారా..?

By:  Tupaki Desk   |   2 Nov 2020 11:30 PM GMT
ఇండస్ట్రీలోని కొందరు సినిమాల విడుదలను అడ్డుకుంటున్నారా..?
X
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ లో సినిమా విడుదల అవకుండానే ఎనిమిది నెలలు గడిచిపోయింది. అయితే లాక్ డౌన్ వల్ల మూతపడిపోయిన థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తెరుచుకోమని సూచించింది. అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ చేయడంలేదు.. సినిమాలు రిలీజ్ చేయలేదు. ఇప్పటికే కంప్లీట్ అయిన సినిమాలు రిలీజ్ చేయడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఆడియెన్స్ థియేట‌ర్స్ కు వస్తారో రారో అనే ఆలోచనతోనే అని అందరూ భావించారు. అయితే కరోనా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఇప్పటి వరకు తెరిచిన థియేట‌ర్స్ లో అన్నీ బాగానే క‌లెక్ష‌న్స్ తెచ్చుకుంటున్నాయని టాక్ నడుస్తోంది. మరి ఫిలిం మేకర్స్ ఎందుకు తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో వెన‌కంజ వేస్తున్నారనే అనుమానం కలుగుతోంది.

అయితే విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ లో చాలా మంది మేకర్స్ థియేట‌ర్స్ తెరిస్తే తమ సినిమాలను విడుద‌ల‌ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు థియేటర్స్ రీ ఓపెన్ చేయనీకుండా సినిమాల విడుదల అవ్వ‌కుండా ఆపుతున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ థియేటర్స్ అన్నిటిని త‌మ గుప్పిట్లో పెట్టుకొని వాటి మీద పెట్టుబ‌డులు.. లీజులు అంటూ ఇన్నాళ్లు ఇండ‌స్ట్రీని శాసించారో వారే ఇప్పుడు సినిమాల విడుద‌లను అడ్డుకుంటున్నారట. దీనికి కార‌ణం వీరంతా బ్యాంకులు నుంచి థియేట‌ర్ లీజులుకి సంబంధించిన పెట్టుబడుల కోసం భారీగా అప్పులు చేసి ఉండటమే అని టాక్. అందుకే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలకి ఈ లాక్ డౌన్ టైమ్ లో వడ్డీలను మాఫీ చేయాలని కోరిన‌ట్లుగా సమాచారం. దీనికి ఏపీ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించగా.. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి మాత్రం పెద్ద‌గా స్పంద‌న రాలేదని తెలుస్తోంది.