Begin typing your search above and press return to search.

చిరు గుండు నిజమా? కాదా?

By:  Tupaki Desk   |   14 Sep 2020 3:30 PM GMT
చిరు గుండు నిజమా? కాదా?
X
మెగాస్టార్‌ చిరంజీవి షాకింగ్‌ గా గుండు లుక్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. ఆ ఫొటోను చూసి రామ్‌ చరణ్‌ కూడా షాక్‌ అయినట్లుగా కామెంట్‌ పెట్టాడు. ఒక సినిమా కోసం ఇలాంటి గెటప్‌ ను చిరంజీవి ట్రై చేయబోతున్నట్లుగా ఇప్పటికే మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అది ఏ సినిమా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఎప్పుడో చేయబోతున్న సినిమా షూటింగ్‌ కోసం ఇప్పుడే ఎందుకు గుండు కొట్టించుకున్నాడు మెగాస్టార్‌ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చిరు గుండును చాలా మంది నిజమైనదిగా భావిస్తుంటే కొందరు మాత్రం అది మేకప్‌ అయ్యి ఉండవచ్చు అంటూ చాలా బలంగా నమ్ముతున్నారు. త్వరలో ఆచార్య షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాల్సిన చిరంజీవి గుండు కొట్టించుకునే అవకాశం లేదని వారు బలంగా నమ్ముతున్నారు. ఒక కథ చర్చల భాగంగా గుండుతో నటించాల్సి ఉంటుందని చెప్పగా సరదాగా చిరంజీవి అలా మేకప్‌ చేయించుకున్నాడు అనే వాదన వినిపిస్తుంది. అయితే చిరంజీవి తదుపరి ఫొటోగ్రాఫ్‌ వచ్చే వరకు ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.