Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్: రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు
By: Tupaki Desk | 18 Jun 2020 2:30 PM GMTఆకతాయిలు పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టేలా తుంటరి చర్యలకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులు తీవ్ర తంటాలు పడ్డారు. మరోసారి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. చెన్నైలోని పోయిస్ గార్డెన్స్‌లో ఉన్న రజనీ నివాసంలో బాంబు పెట్టామని.. అది ఏ క్షణమైనా పేలుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ ఫోన్ కాల్‌తో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే రజనీ ఇంటికి చేరుకుని సోదాలు చేశారు.
బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు అణువణువున తనిఖీలు చేశారు. బాంబు ఎక్కడుందేమోనని మొత్తం వెతికారు. చివరకు బాంబు ఆచూకీ లభించలేదు. దీంతో ఆ ఫోన్ ఆకతాయిల పనిగా పోలీసులు గుర్తించారు. ఫేక్ కాల్‌గా గుర్తించి ఇది ఎవరో ఆకతాయి చేసిన పనిగా నిర్ధారించారు. ఈ సందర్భంగా ఫోన్ కాల్ ఆధారంగా ఆ వ్యక్తి ఎవరో పోలీసులు తెలుసుకుంటున్నారు.
అయితే రజనీకాంత్ ఇంటికి ఇలాంటి వార్త రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి బెదిరింపుల కాల్స్ వచ్చాయి. ఆకతాయిల పని పట్టే పనిలో పోలీసులు తీవ్ర నిర్ణయం తీసుకోనున్నారు. అయితే త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులకు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. అందుకే బెదిరింపు కాల్ రావడంతో వెంటనే పోలీసులు స్పందించారు.