Begin typing your search above and press return to search.
సింపుల్ గా కనిపిస్తున్నా సంథింగ్ స్పెషల్ లేడీ
By: Tupaki Desk | 4 July 2021 10:30 AM GMTచూడటానికి సింపుల్ గా కనిపిస్తుంది. సాధారణ ఛామనఛాయతో సాధాసీదాగానే ఉంటుంది. హిమచల్ ఆపిల్ లా ఊరించే బూరె బుగ్గలు తేనె కళ్లు లేనే లేవు.. అయినా కానీ నటిగా మెరుపులు మెరిపిస్తుంది. ప్రతిభ విషయంలో అస్సలు ఎక్కడా తగ్గదు. ఇప్పటివరకూ షాలిని నటించిన ప్రతి సినిమాలో తనకు తన నటనకు మంచి పేరు గుర్తింపు దక్కాయి. ఇంకా అర్జున్ రెడ్డి నాయికగా బోలెడంత గౌరవం అందుకుంటోంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో రణవీర్ లాంటి పెద్ద హీరో సరసన అవకాశం అందుకుంది. జయేష్ భాయ్ జోర్దార్ అనేది ఈ జంట నటిస్తున్న సినిమా టైటిల్. దివ్యంగ్ ఠక్కర్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా -మనీష్ శర్మ నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ తొలి చిత్రం `మహారాజా`లో కూడా షాలిని కనిపిస్తుంది. సిధార్థ్ పి మల్హోత్రా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాల్లోనూ షాలిని చురుగ్గానే ఉంది. తాజాగా వీకెండ్ వైబ్స్ లో షాలిని కొత్త లుక్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. కుంకుమ నారింజ రంగులో ఉండే శాటిన్ ప్యాంటును ధరించి అభిమానులందరి దృష్టిని ఆకర్షించింది. బాల్కనెట్ ఆఫ్-షోల్డర్ టాప్ మ్యాచింగ్ ప్యాంటు .. హూప్ చెవిరింగులతో కనీస ఉపకరణాలతో చాలా సింపుల్ గా కనిపిస్తోంది. ఇటీవల బాగా బరువు తగ్గాక షాలిని మరింతగా మిలమిలా మెరిసిపోతోంది.
ఇటీవల తన ఆహార విధానాన్ని కూడా మార్చుకుందిట ఈ బ్యూటీ. రెగ్యులర్ గా వ్యాయామం యోగా సెషన్స్ లో పాల్గొనడం ద్వారా తన బరువు ను చాలావరకూ తగ్గించుకుంది. ప్రస్తుతం ఎంతో స్లిమ్ లుక్ తో ఆకర్షిస్తోంది. ఇక ఇదే హుషారులో తమిళం-తెలుగులోనూ తిరిగి అవకాశాల్ని పెంచుకునేందుకు దర్శకనిర్మాతలకు టచ్ లో ఉందని తెలిసింది.