Begin typing your search above and press return to search.
కొన్నిసార్లు భవిష్యత్ మన చేతిలో ఉండదు!
By: Tupaki Desk | 2 Aug 2019 9:30 AM GMT`రన్ రాజా రన్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సుజీత్. ఆ సినిమా తర్వాత ఇప్పటికే ఐదేళ్లయ్యింది. ఈ ఐదేళ్లలో ఏం చేశాడు? అంటే ఒకే ఒక్క `సాహో` కోసం అంత విలువైన సమయాన్ని త్యాగం చేశాడు. ఒక రకంగా ఒకే ఒక్క సినిమా కోసం కెరీర్ ని త్యాగం చేశాడన్న ఫీలింగ్ సుజీత్ ఫ్యాన్స్ లో ఉంది. వేరొక దర్శకుడు అయితే ఏడాదికి రెండు చొప్పున ఈపాటికే పది సినిమాలు తీసేవాళ్లు. కానీ సుజీత్ వేరు అని అర్థం చేసుకోవడానికి టైమ్ పట్టింది. ఇక ఇదే విషయాన్ని నేడు ఆయనను తెలుగు సినీమీడియా ప్రశ్నిస్తే ఏం చెప్పారో తెలుసా?
రాక రాక సుజీత్ టాలీవుడ్ మీడియా ముందుకు రాగానే ప్రశ్నల పరంపరతో మనోళ్లు విరుచుకు పడ్డారు. అందులోంచి ఐదేళ్ల పాటు వేచి చూడడం అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి సుజీత్ ఎంతో సావధానంగా సమాధానమిచ్చాడు. ``నా మొదటి సినిమా వచ్చి ఐదేళ్లయ్యింది. ఆ తర్వాత సాహో కోసమే పని చేస్తున్నా. కొన్ని సార్లు భవిష్యత్ మన చేతిలో ఉండదు. అయినా వెయిటింగ్ ప్రాసెస్ వల్ల చాలా నేర్చుకున్నా. పది సినిమాల్లో నేర్చుకున్నంత ఒకే సినిమాతో నేర్చుకున్నాను. దీనిని ఎంజాయ్ చేశాను`` అని తెలిపాడు.
ఈ సినిమా చాలా ఆలస్యమైనట్టుంది? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని తెలిపాడు. సినిమా బడ్జెట్ కంట్రల్ చేయడానికి ప్రీప్రొడక్షన్ ఎక్కువ చేశాం. అయితే చాలా డిలే అయ్యింది అనుకున్నారంతా. సాహో లో యాక్షన్ పార్ట్ ఎక్కువ. అందుకే చాలా ముందే ప్రీప్రొడక్షన్ కోసం చాలా చేశాం. అలాగే అప్పట్లో టీజర్ ని రిలీజ్ చేస్తే అప్పటికే సినిమా స్టార్టయిందనుకున్నారు. కానీ కానీ ఆ సంవత్సరం నవంబర్ లోనే స్టార్ట్ చేశాం. టీజర్ వచ్చేప్పటికి షూటింగ్ స్టార్ట్ చేయలేదు అంటూ రకరకాల ప్రచారంపైనా సుజీత్ ఓపెన్ అయ్యాడు. ప్రీప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకోవడం వల్లనే చాలా టైమ్ అయినట్టు అనిపిస్తోందని అన్నాడు. ఇక ఇందులో తొలుత అనుకున్న కథ యథాతథంగానే ఉంది. యాక్షన్ సన్నివేశాల్ని బెటర్ గా తీర్చి దిద్దేందుకే ఎక్కువ సమయం తీసుకున్నానని కూడా సుజీత్ తెలిపారు. మొత్తానికి కుర్రాడు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ మీడియా ముందుకు వచ్చాడలా.