Begin typing your search above and press return to search.
అప్పుడెప్పుడో చనిపోయిన దివ్యభారతిని సీన్లోకి లాగిందే?
By: Tupaki Desk | 9 Oct 2021 6:30 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఉన్న కారణంతో అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోదాలు నిర్వహించిన వేళలో.. ఆర్యన్ ఖాన్ వద్ద నిషేధిత డ్రగ్స్ ఉన్నాయా? లేదా? కావాలనే టార్గెట్ చేశారా? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్న వేళ.. పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేరారోపణలతో ఉన్న ఆర్యన్ ఖాన్ కు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. మరోవైపు.. బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు.. నటీనటులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
కొందరు చిన్నపిల్లాడు అంటూ వెనకేసుకు వస్తే.. మరికొందరు.. ఆర్యన్ పై వెల్లువెత్తుతున్న ఆరోపణల్ని తిప్పి కొడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో సీనియర్ నటి పెను సంచలనానికి తెర తీశారు. సోమీ అలీ తన సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆర్యన్ చేసింది తప్పేమీ కాదని తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు.
పిల్లలు డ్రగ్స్ వాడటం సహజమని.. అదేమీ తనకు పెద్ద విచిత్రంగా అనిపించలేదన్నారు. వ్యభిచారం.. డ్రగ్స్ వంటి వాటిని పూర్తిగా తొలగించలేదమని చెప్పింది. అందుకే వాటిని క్రిమినల్ జాబితా నుంచి తొలగించాలంటూ తన పైత్యాన్ని ప్రదర్శించింది. సినీ రంగంలో ఎవరూ సాధువులు కాదని.. తనకు పదిహేనేళ్ల వయసులో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పింది.
ఆందోళన్ మూవీ తీస్తున్న వేళ.. సూసైడ్ చేసుకొని మరణించిన దివ్య భారతితో కలిసి డ్రగ్స్ ను ట్రై చేసినట్లు చెప్పి సంచలనంగా మారారు. ఈ విషయాల్ని చెప్పటానికి తానెలాంటి తప్పు చేసినట్లుగా భావించటం లేదని చెప్పింది. డ్రగ్స్ తీసుకోవటం నేరం కాదన్నట్లుగా మాట్లాడుతున్న ఇలాంటి సీనియర్ నటి మీదా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. నిజాల్ని చెప్పేస్తామంటూ తెగ మాట్లాడుతున్న ఇలాంటి వారు.. అప్పుడెప్పుడో చనిపోయిన వారి పేరును కూడా లాగేసి వారి ఇమేజ్ డ్యామేజ్ చేయటం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.