Begin typing your search above and press return to search.
ప్రైమ్ లోనూ 'సన్నాఫ్ ఇండియా'కి సౌండ్ లేదే!
By: Tupaki Desk | 18 May 2022 5:33 AM GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన 'సన్నాఫ్ ఇండియా' ఇటీవల రిలీజ్ అయి ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. రిలీజ్ కి ముందు మోహన్ బాబు ఈజ్ బ్యాక్ అనే ఫలితంతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని మంచు అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. చాలాగ్యాప్ తర్వాత మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్ర పోషించడంతో సినిమాపై అంచానలు భారీగానే ఏర్పడ్డాయి.
మోహన్ బాబు ఈజ్ బయాక్ అనిపించే ఫలితంతో కొట్టడం ఖాయమని ప్రచారం సాగింది. కానీ రిలీజ్ తర్వాత ఫలితాలు ఊహించని నిరాశని మిగిల్చాయి. ఈ సినిమా మంచు ఫ్యామిలీని రిలీజ్లలకి ముందు తర్వాత కూడా విడిచిపెట్టలేదు. సరిగ్గా సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో సినిమాలో కొన్ని డైలాగులు..పాత్రల్ని ట్రోల్ చేసారు.
ఈ విషయాన్ని మోహన్ బాబు సీరియస్ గా తీసుకుని ప్రచార కార్యక్రమంలో వాళ్లపై సీరియస్ అయ్యారు. ఓ ఇద్దరు హీరోలు తనని టార్గెట్ చేసి ఇలా చేయిస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల సంగతేంటో చూస్తానని హెచ్చరించారు. ఇలా రిలీజ్ కి ముందే మోహన్ బాబు మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. దీంతో మరోసారి ట్రోలింగ్ కి గురయ్యారు.
నిజంగా ఆ హీరోలు ఇద్దరు ఎవరో తెలిస్తే మీడియా ముఖంగా చెప్పొచ్చుగా అంటూ మరోసారి ట్రోలింగ్ లు మొదలు పెట్టారు. ఇక రిలీజ్ తర్వాత సినిమాకి వచ్చిన టాక్ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ట్రోలింగ్స్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. 'సన్నాఫ్ ఆఫ్ ఇండియా'లాంటి గొప్ప టైటిల్ సినిమాకి అసలు సెట్ అయిందా? అటూ ట్రోలర్స్ దాడి మొదలు పెట్టారు.
అక్కడ నుంచి ఒక్కో పాత్రని తీసుకుని విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం వివాదం చినిగి చినిగి గాలి వానలా మారింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు వరకూ దారి తీసింది.ఎలాగూ వివాదం అప్పటికలా చల్లారింది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ప్రైమ్ లో కూడా 'సన్నాఫ్ ఇండియా'కి సౌండ్ లేదనే ఫీడ్ బ్యాక్ వస్తోంది.
థియేటర్లో సక్సెస్ కాకపోయినా ఓటీటీలోనైనా థియేటర్ కన్నా మెరుగ్గా ఉంటుందని యూనిట్ పెట్టుకున్న ఆశలు ఇక్కడా అడియాశలగానే మిగిలిపోయానే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా కొన్ని సినిమాలు థియేటర్లో ఫెయిలైనా ఓటీటీలో నెమ్మదిగా నెట్టికొస్తున్నాయి. టైంపాస్ ఎంటర్ టైనర్లగా పేరు తెచ్చుకుంటున్నాయి.
కానీ 'సన్నాఫ్ ఇండియా'కి ఓటీటీలో ఆ తరహా గుర్తింపు కూడా దక్కడం లేదని అంటున్నారు. సినిమాపై వచ్చిన నెగివిటీ కూడా ఓటీటీ రిలీజ్ పై కొంత ప్రతికూల ప్రభావం చూపించినట్లే కనిపిస్తుంది. మరి మళ్లీ ట్రోలర్లు ఎటాకింగ్ దిగుతారా? సైలైంట్ గా ఉంటారా? అన్నది చూడాలి. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్- 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.