Begin typing your search above and press return to search.
'సన్ ఆఫ్ ఇండియా' ఏకపాత్రాభినయం ఎలా ఉందంటే..?
By: Tupaki Desk | 18 Feb 2022 12:26 PM GMTకలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్ లో నటించిన సినిమా ''సన్ ఆఫ్ ఇండియా''. రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూర్చారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ - శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకాలపై మంచు విష్ణు నిర్మించారు.
ఇందులో మీనా - శ్రీకాంత్ - ప్రగ్యా జైస్వాల్ - తనికెళ్ళ భరణి - ఆలీ - పోసాని కృష్ణమురళి - వెన్నెల కిషోర్ - పృథ్వీరాజ్ - రాజా రవీంద్ర - రఘుబాబు - రవి ప్రకాష్ - మంగ్లీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా అని చెబుతూ ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎన్.ఐ.ఎ అధికారిణి ఐరా (ప్రగ్యా జైశ్వాల్) దగ్గర కడియం బాబీ (మోహన్ బాబు) డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. కేంద్రమంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్) తోపాటు మరో ఇద్దరు కిడ్నాప్ కు గురవడంతో.. ఆ కేస్ ని ఛేదించడం కోసం ఐరా నేతృత్వంలోని ఎన్.ఐ.ఎ బృందం రంగంలోకి దిగుతుంది.
ఆ మూడు కిడ్నాప్ కి సూత్రధారి బాబీ అనే విషయం బయటపడుతుంది. అతను కిడ్నాప్ కి పాల్పడటానికి కారణమేంటి? ప్రింటింగ్ ప్రెస్ నడుపుకునే విరూపాక్ష.. కడియం బాబీగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేది ''సన్ ఆఫ్ ఇండియా'' సినిమాలో చూపించారు.
దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ సినిమాని ఓటీటీ కోసమే రాసుకొని తీశానని ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే సినిమా రన్ టైమ్ 1గంట 25 నిమిషాలు మాత్రమే ఉంది.
ముందు నుంచి చెబుతున్నట్టే ఈ సినిమాని మోహన్ బాబు ఏకపాత్రాభినయం చేసి ఓ ప్రయోగంలానే తీశారు. ఎక్కువ శాతం మోహన్ బాబు మాత్రమే కనిపిస్తూ.. మిగతా పాత్రలు కనిపించకుండా కేవలం వినిపించేలా సన్నివేశాలను చిత్రీకరించారు.
కాకపోతే 'సన్ ఆఫ్ ఇండియా' ప్రయోగం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదని టాక్ ని బట్టి అర్థం అవుతోంది. రాజకీయ నాయకుడి కారణంగా తన కుటుంబాన్ని కోల్పోయిన ఓ వ్యక్తి వారి మీద పగ తీర్చుకోవడం.. తనలా ఇంకెవ్వరికీ జరగకూడదని సాగించే పోరాటమే ఈ కథ.
ఇలాంటి కథలతో తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. కొత్త కథ కాకపోయినా.. దాన్ని నడిపించిన తీరు కొత్తగా ఉంటే జనాలు ఆదరించేవారే. కానీ అదే ఈ సినిమాలో మిస్ అయిందని అంటున్నారు.
మోహన్ బాబు మార్క్ సంభాషణలు ఈ సినిమాలో కావాల్సినన్ని ఉన్నాయి. అందులో సందర్భోచితంగా వచ్చేవి కొన్నే అని తెలుస్తోంది. ఏ దశలోనూ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేకెత్తించేలా సినిమా నడవకపోవడం.. తెలిసిన కథ కావడం.. సన్నివేశాల్లో భావోద్వేగాలు పండకపోవడం.. కమెడియన్స్ ఉన్నా ఒక్క సీన్ కూడా పెద్దగా నవ్వించకపోవడం ఈ సినిమా మైనస్ పాయింట్లో ఉన్నాయి.
చిరంజీవి గొంతుతో మోహన్ బాబు పాత్రని పరిచయం చేసిన విధానం బాగుందని ఆడియన్స్ చెబుతున్నారు. అలానే డైలాగ్ కింగ్ నటన.. రఘువీర గద్యంని ఇళయారాజా చేత కంపోజ్ చేయించి పెట్టడం సినిమాకు ప్లస్ పాయింట్. సాంకేతిక విభాగాలు పర్వాలేదు.
మోహన్ బాబు లుక్ డిజైనింగ్.. విరానికా మంచు చేసిన స్టైలింగ్ బావున్నాయని అంటున్నారు. మొత్తం మీద 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా ఆశించిన స్థాయిలో లేదని ఆడియన్స్ తీర్పిచ్చేసారు.