Begin typing your search above and press return to search.
సత్యమూర్తి స్పెషల్: తత్వం తగ్గించు గురూ
By: Tupaki Desk | 9 April 2015 1:37 PM GMTత్రివిక్రమ్ అని పిలిచే కంటే తత్వవేత్త అని పిలిస్తే తప్పేం కాదు. ఫిలాసఫీ, సైకాలజీ వంటి సబ్జెక్టుల్ని తన సినిమాల్లో, క్యారెక్టర్లలో ప్రెజెంట్ చేస్తుంటాడు త్రివిక్రమ్. లోతైన సంభాషణలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, దానికి తగ్గట్టే సన్నివేశ బలం అతడి సినిమాల్లో కనిపిస్తుంటాయి. పైపై మెరుగులైతే ఎక్కడా కనిపించనే కనిపించవు. ఒకసారి చూస్తే అర్థం కాదు.. అన్న అపవాదు నుంచి ఒకసారి చూసినా అద్భుతమే అనిపించే సినిమాల్ని తీస్తున్నాడు
ఇటీవలి కాలంలో. జల్సా, అతడు, జులాయి, అత్తారింటికి దారేది చిత్రాలతో అతడు తనని తాను గొప్పగా ఆవిష్కరించుకున్నాడు. అయితే అత్తారింటికి దారేది ఎంతటి రికార్డుల్ని తిరగరాసినా ఆ సినిమాలో త్రివిక్రమ్ స్థాయి పూర్తిగా కనిపించలేదన్న విమర్శలు వచ్చాయి. అతడిలో పట్టు సడలింది. అందుకే పంచ్ తగ్గింది.. అన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా సన్నాఫ్ సత్యమూర్తిలో త్రివిక్రమ్ మార్క్ పంచ్‌లు కనిపించలేదే అని పెదవి విరిచేస్తున్నారు విమర్శకులు. అంతేకాదు.. తాత్వికత, పిట్టకథల పేరుతో అసలు విషయాన్ని సాగదీస్తున్నాడా? అన్న కన్ఫ్యూజన్ జనాల్లో కనిపిస్తోంది.
సత్యమూర్తిని ప్రథమార్థం చూసి పర్లేదులే అనుకున్న వాళ్లు కాస్తా, ద్వితీయార్థంలోకి వెళ్లేప్పటికి బరువెక్కిన గుండెలతో కాస్త ఇబ్బందికరంగా బైటికి వచ్చే పరిస్థితి కనిపించింది. ఎమోషన్ పాళ్లు ఎక్కువ దట్టించాలి అనుకున్నా కానీ అవన్నీ సమపాళ్లలో కుదరలేదేమో అనిపిస్తుంది. కంటెంట్ పరంగా మరీ ఎక్కువ క్లాస్ పీకే నైజం అతడిలో పెరిగిపోతోందేమో అనిపిస్తోంది. విలువలు అంటూ బన్ని పాత్రతో కాస్తా క్లాస్ పీకించాడేమో అనిపించింది. సినిమా తీస్తే సందేశం ఇవ్వకపోతే ఎలా? కొంతైనా సమాజానికి మంచి చేయకపోతే ఎలా? అని ఆలోచించడం వల్ల కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
పైగా విలువలే బతికి ఉంటాయి.. అని ఇప్పుడున్న బిజీబిజీ బ్రతుకుల ప్రపంచానికి చెప్పాలనుకోవడం కూడా ఓ తప్పుగానే పరిగణించాల్సొస్తుందేమో! దుర్మార్గం పెరిగిపోయిన ఈ రోజుల్లో హీరో క్రిమినల్ అయితేనే కిక్కు. రాముడు మంచి బాలుడులా ఉంటే కష్టం. విలువలు కోల్పోతున్న సమాజానికి అవి నేర్పించడం అవసరమే. కానీ ఇలా సినిమాతోనే ఆ పనిచేస్తానంటే మార్కెట్ ఒప్పుకోదేమో!