Begin typing your search above and press return to search.
బన్నీ.. 54 కోట్ల గేమ్.. అంతా రెడీ
By: Tupaki Desk | 8 April 2015 1:47 PM GMTసినిమా మొత్తం మీద నిర్మాతలకు 67 కోట్ల వరకు తెచ్చిపెట్టినా, అది నిర్మాతలకు మాత్రమే చెల్లుతుంది. ఇక ధియేట్రికల్ రైట్స్ మొత్తంగా కలుపుకొని 54 కోట్లకు అమ్మేశారు. పంపిణీదారులూ, బయ్యర్లు, ఎగ్జిబిట్టర్లు.. ఇలా అందరికీ 54 కోట్లు వస్తేనే ముందు ఇన్వెస్ట్ చేసిన డబ్బు తిరిగొచ్చేది. అవును, మనం మాట్లాడుతోంది ''సన్ ఆఫ్ సత్యమూర్తి'' గురించి. రేపు ఉదయం 4 గంటలకు పడే ప్రీమియర్ షో బొమ్మతో ఈ సినిమా గేమ్ స్టార్ట్ అవుతుంది మరి.
స్టయిలిష్ స్టార్ బన్నీ మరోసారి త్రివిక్రమ్‌తో జతకట్టి... జీవితంలో తండ్రి పాత్ర ఎంత ముఖ్యం అనే పాయింట్‌ను చెప్పడానికి ఇప్పుడు ''సన్ ఆఫ్ సత్యమూర్తి'తో వస్తున్నారు. భారీ స్టార్ క్యాస్ట్‌తో దూసుకొస్తున్న బన్నీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తన గత సినిమా రేసుగుర్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి 57 కోట్లు షేర్ వసూలు చేసింది. సో, ఇప్పుడు 54 కోట్ల షేర్ అంటే.. మరోమారు బ్లాక్‌బస్టరే కొట్టాలి. సినిమా యావరేజ్ అనే టాక్ మాత్రం రాకూడదు. బొమ్మ చింపేసింది అనే టాక్ వస్తేనే చాలా తేలికగా బన్నీ ఈ డబ్బులను వసూలు చేసి తన డిస్ట్రిబ్యూటర్ల పాకెట్లులో లాభాలు నింపుతాడు. లేకపోతే సీన్ సితారే.
రేపు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1500 షుమారు స్క్రీన్స్‌లో ప్రదర్శిస్తున్నారు. అన్ని చోటలా బన్నీ కనుక డిస్టింక్షన్‌లో పాసు మార్కు వేయించుకున్నాడంటే ఇక తిరుగేలేదు. ప్రతీసారి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఒక పెద్ద ఎసెట్. ఈసారి కూడా ఓ నాలుగు పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. చూద్దాం కుర్రాడి హవా ఎలా సాగబోతుందో...