Begin typing your search above and press return to search.

నా శరీరం నా ఇష్టానుసారం చూపిస్తా నీకేంటి?

By:  Tupaki Desk   |   24 Nov 2020 5:31 PM GMT
నా శరీరం నా ఇష్టానుసారం చూపిస్తా నీకేంటి?
X
బాలీవుడ్‌ హాట్‌ సింగర్‌ సోనా మొహపాత్ర పై ఒక నెటిజన్‌ సీరియస్ కామెంట్‌ చేశాడు. పాడటంపై దృష్టి పెట్టకుండా ఎప్పుడు హాట్‌ ఫొటో షూట్‌ లు క్లీవేజ్‌ ఎక్స్‌ పోజింగ్‌ పై ఎందుకు మీరు దృష్టి పెడుతున్నారు. మీ ప్రతి ఫొటోలో కూడా క్లీవేజ్‌ ను ఎక్కువగా చూపిస్తున్నారు. మీరు మీ కెరీర్‌ లో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కామెంట్‌ పెట్టాడు. అతడి కామెంట్‌ కు సోనా చాలా సీరియస్ గా రియాక్ట్‌ అయ్యింది. మరెవ్వరు అలాంటి కామెంట్స్‌ పెట్టకుండా ఉండేలా అతడి పట్ల ఘాటుగా రియాక్ట్‌ అవ్వడం జరిగింది.

నా శరీరం నా ఇష్టం. నా క్లీవేజ్‌ నాకు ఎలా నచ్చితే అలా ఉంటాను. నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను నీకేంటి అన్నట్లుగా సోనా సమాధానం చెప్పింది. సోనా సమాధనంకు చాలా మంది నెటిజన్స్‌ స్పందించారు. అతడి వంకర దృష్టికి నీ సమాధానం చాలా బాగుంది. కొందరు ఆడవారి శరీరాల గురించి మాట్లాడే వారికి ఇది సరైన సమాధానం అంటూ ఆమెను ప్రశంసించారు. కొందరు మాత్రం ఒక అభిమానిగా నీ పాటలపై దృష్టి పెట్టమంటూ సలహా ఇస్తే తీసుకోవాలి కదా అంటున్నారు. మొత్తానికి సోనా బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.