Begin typing your search above and press return to search.
ట్రోలర్ ని ఉతికి ఆరేసిన ఫేమస్ సింగర్
By: Tupaki Desk | 30 Jan 2022 2:31 PM GMTసోషల్ మీడియాల్లో ట్రోలింగ్ కల్చర్ శ్రుతిమించిన సంగతి తెలిసిందే. ఈ వేదికలపై ద్వంద్వార్థాలు బూతులు పెచ్చు మీరుతున్నాయి. ఇన్ స్టా ట్విట్టర్ వంటి చోట్ల హీరోయిన్లు ఏ రేంజ్ లో టార్గెట్ అవుతుంటారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఎవరో ఒక నటీమణి లేదా హీరోయిన్ ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నారు. అందునా బాలీవుడ్ హీరోయిన్లు ట్రోలర్లతో మరింత ఇబ్బందులకు గురవుతుండడం చూస్తున్నాం. హీరోయిన్ల వ్యక్తిగత విషయాల్లోనూ తలదూర్చి ట్రోలింగ్ చేయడం ఆకతాయిలకు పరిపాటిగా మారింది. తాజాగా అమీర్ ఖాన్ కుమార్తె ఇరాఖాన్ దారుణమైన ట్రోలింగ్ కి గురైంది. సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ఆమెను తీవ్రంగా దూషించాడు. ఇరాఖాన్ లుక్...శరీర సౌష్టవం గురించి అభ్యంతరక కామెంట్లు చేసాడు.
అయితే ఈ విషయంలో ఇరాకు నెటిజనుల నుంచి మద్ధతు దక్కింది. ఇరాఖాన్ సైలెంట్ గా ఉన్నా సింగర్ సోనా మొహపాత్ర మాత్రం ఊరుకోలేదు. ఆ ట్రోలర్ కి ఓ రేంజ్ లో క్లాస్ తీస్కుంది. ఇంతకీ ఆట్రోలర్ ఇరాఖాన్ ని ఎలా టార్గెట్ చేసాడంటే... మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఇరాని అతడు టార్గెట్ చేసాడు. ఇరా మంచి ఆలోచనకు సోనా మొహాపాత్ర స్పందిస్తూ.. `గుడియా( బొమ్మలా ఉన్నావ్) డాలీ` అంటూ ఇరా ఖాన్ ని ప్రశంసించింది. దీనికి ఓ నెటిజనుడు ఇరా నీకు బొమ్మలా కనిపిస్తుందా? అని కామెంట్ చేసాడు. అంతటితో ఆగకుండా ఇరాఖాన్ కళ్లకింద నల్లటి చారలు.. ముడతలు పడినట్లు ఉన్న ఆ చర్మాన్ని చూస్తుంటే నాకు ముసలిదానిలా కనిపిస్తుంది. ఆ ముఖం చూస్తే ఏదో ఫీలింగ్ కలుగుతుందని కామెంట్ చేసాడు.
దీంతో సోనా అగ్గిమీద గుగ్గిలం అయింది. ``నీకు పనీ పాటా లేదు. అందుకే ఇలా పిచ్చి వాగుడు వాగుతున్నావ్. నీబ్రతుకంతా ఓటమే. ఆ విసుగునంతా మాపై ఇక్కడ విషం రూపంలో చిమ్ముతున్నావ్. ఏదైనా పని చేసుకుని గౌరవంగా సమాజంలో బ్రతుకు. ఇలాంటి బ్రతుకుతో నీ తల్లిదండ్రులకు తలవంపులు తీసుకురాకు . నీలాంటి వాళ్ల వల్ల కన్న వాళ్లు ఎంత బాధపడడతారో`` అని మండిపడింది. ఆమె వ్యాఖ్యలకు చాలా మంది నెటిజనులు మద్దతు పలికారు. ఇలాంటి వాళ్లకు అలాగే మందలించాలని కామెంట్లు చేస్తున్నారు. ఇరాఖాన్ కెమెరా వెనక దర్శకురాలిగా అనుభవం ఘడించింది. నూపుర్ శిఖారే అనే జిమ్ కోచ్ ని ప్రేమించింది. ప్రస్తుతం ఈ జంట రొమాంటిక్ లైఫ్ అభిమానులు పబ్లిక్ కి తెలిసినదే.