Begin typing your search above and press return to search.

వారిద్దరూ అలా దొరికిపోయారు

By:  Tupaki Desk   |   6 Nov 2016 4:37 AM GMT
వారిద్దరూ అలా దొరికిపోయారు
X
బాలీవుడ్ ప్రేమాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం ఉండదు. ప్రతిఒక్కరూ ఎవరితో ఒకరితో లింకు ఉందన్న వార్తలు తరచూ వస్తుంటాయి. వాటిని సదరు సెలబ్రిటీ ఖండించటం.. దానికి కౌంటర్ అన్నట్లుగా వారు చెప్పింది అబద్ధమన్న విషయం చెప్పే ప్రయత్నాలు జోరుగా సాగుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. బాలీవుడ్ కొత్త జంటగా సోనాక్షి సిన్హా.. బంటీ సజ్దేను చెప్పొచ్చు.

తమ ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పినప్పటికీ.. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న విషయాన్ని మీడియా కోడై కూస్తోంది. అయితే.. ఈ మధ్యన వీరిద్దరూ విడిపోయినట్లుగా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే.. దీన్ని ఖండిస్తూ మరికొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. ఇదిలా ఉంటే.. వీరిద్దరి ప్రేమాయణం మీద ఇటీవల ముంబయి మిర్రర్ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. వీరిద్దరి మధ్య ఘాటు ప్రేమ పెళ్లి వైపు అడుగులు వేసేలా చేస్తుందని.. త్వరలోనే వీరిద్దరూ ఒకటి కావటం ఖాయమన్న మాటను పేర్కొంది. అయితే.. ఈ కథనంలో నిజం లేదని సోనాక్షి తోసిపుచ్చటం వేరే సంగతి.

ఇదిలా ఉండగా.. వీరి మధ్య ప్రేమా.. గీమా ఏమీ లేవని.. వారిద్దరూ ఎప్పుడో బ్రేకప్ అయిపోయారంటూ కొన్ని కథనాలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరూ ఒక రెస్టారెంట్ కు కలిసి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. డిన్నర్ డేటింగ్ కోసం వీరిద్దరూ ముంబయిలోని ఒకప్రముఖ రెస్టారెంట్ కు వెళ్లి మీడియాకు దొరికేశారు. బాంద్రాలోని ఒక రెస్టారెంట్ కు వెళ్లిన వీరు కాసేపు సరదాగా గడిపినట్లుగా తెలుస్తోంది. డేటింగ్ తర్వాత తొలుత సోనాక్షి బయటకు రాగా.. ఆమె వెళ్లిన కాసేపటికి ఆమె బాయ్ ఫ్రెండ్ బంటీ సజ్దే బయటకు రావటం గమనార్హం. చూస్తుంటే.. తమ మధ్య బ్రేకప్ లాంటివి ఏమీ లేవని చెప్పటం కోసమే ఈ జంట ఇలా డిన్నర్ డేటింగ్ కి వచ్చి ఉంటారన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/