Begin typing your search above and press return to search.

సోనాక్షి వేలికి రింగ్..ఎవ‌రా ల‌క్కీ గ‌య్?

By:  Tupaki Desk   |   9 May 2022 10:30 AM GMT
సోనాక్షి వేలికి రింగ్..ఎవ‌రా ల‌క్కీ గ‌య్?
X
శ‌త్రుఘ్న సిన్హా వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ ని దున్న‌స్తుంది సోనాక్షి సిన్హా. `ద‌బాంగ్` సినిమాతో లాంచ్ అయిన భామ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒకే ఏడాది ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది. ప్ర‌స్తుతం `కాకుడా`..`డ‌బుల్ ఎక్స్ ఎల్` చిత్రాల్లో న‌టిస్తోంది. తాజాగా ఈ భామ ఫోటో ఒక‌టి ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది.

వేలికి ఉంగ‌రం ధ‌రించి..అది ఫోక‌స్ అయ్యేలా కెమెరాకి ఫోజులిచ్చింది. సోనాక్షి చేతిని చూపిస్తూ మేల్ చేయి ఒకటి క‌నిపిస్తుంది. ఆ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ``ఇదొక బిగ్ డే. నా అతి పెద్ద క‌ల‌లో ఒక‌టి నెర‌వేర‌బోతుంది. దాన్ని మీతో పంచుకోకుండా ఉండ‌లేను. ఇది న‌మ్మ‌లేక‌పోతున్నాని`` రాసుకొచ్చింది.

దీంతో సోనాక్షి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని ఇలా ఆల‌స్యంగా చెబుతుందా? అంటూ కామెంట్లు ప‌డుతున్నాయి. అభిమానులంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇంత‌లో సోనాక్షి సిన్హా-జ‌హీర్ అబ్బాస్ రిలేష‌న్ లో ఉన్నారా అన్న విషంయం తెర‌పైకి వ‌స్తోంది. ఇద్ద‌రు రిలేష‌న్ లో ఉన్న‌ట్లు గ‌తంలో మీడియా క‌థ‌నాలు వెడ‌క్కించిన సంగ‌తి తెలిసిందే.

అయితే వారిద్ద‌రిది ప్రేమ‌...స్నేహ‌మా? అన్న‌ది ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై జ‌హీర్ గ‌మ్మ‌త్తైన స‌మాధానం ఇచ్చాడు. ఇలాంటి వార్త‌లు ప‌ట్టించుకోను.. కానీ మీరు అలా ఆలోచిస్తే ఒకే . అది మీ ఇష్టం. ఇది మీకు సంతోషం క‌లిగిస్తే అలాగే కానివ్వండి. ఒక‌వేళ బాధ‌పెడితే గ‌నుక క్ష‌మించండ‌ని సున్నితంగా స్పందించాడు.

దీంతో సోనాక్షి చేతిని ప‌ట్టుకున్న ఆ హీరో ఎవ‌రంటూ మీడియాలో ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర న‌డుస్తుంది. ఇంత‌లో ఓ అభిమాని అది సల్మాన్ ఖాన్ చేయిలా ఉందంటూ సందేహం వ్య‌క్తం చేసాడు. మ‌రి ఆ ల‌క్కీ గ‌య్ ఎవ‌ర‌న్న‌ది తెలియాలి.

అస‌లింత‌కీ అది నిశ్చితార్ధం రింగేనా? అన్న‌ది మ‌రో సందేహం. వేలికి రింగులు తొడుగుకుని కెమెరాకి ఫోజులివ్వ‌కూడ‌దా? ఒక‌వేళ అలా ఫోజు ఇస్తే ఎంగేజ్ మెంట్ చేసుకున్న‌ట్లేనా? అని మరికొంత మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. కార‌ణాలు ఏవైనా సోనాలి వేలి ఉంగ‌రం కొంద‌రి అభిమాను హృద‌యాల్ని సైతం గాయ‌ప‌రుస్తుంది. ఇది మాత్రం వాస్త‌వం.