Begin typing your search above and press return to search.

బాలీవుడ్ భామకి నిశ్చితార్ధం ఖాయం?

By:  Tupaki Desk   |   2 Jan 2017 4:47 AM GMT
బాలీవుడ్ భామకి నిశ్చితార్ధం ఖాయం?
X
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. క్రికెటర్ విరాట్ కోహ్లీలకు ఎంగేజ్మెంట్ ఖాయమైందంటూ కొన్ని రోజుల నుంచి మీడియాలో తెగ వార్తలు వచ్చేశాయి. అయితే.. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని విరాట్ స్వయంగా చెప్పేయడంతో.. వీటికి చెక్ పడింది. అయితే అనుష్క నిశ్చితార్ధం ఫిక్స్ కాలేదు కానీ.. మరో బ్యూటీ సోనాక్షి కి మాత్రం పెళ్లి ఖాయమైనట్లే అంటున్నారు బాలీవుడ్ జనాలు.

బంటి సాజ్డేతో సోనాక్షి పీకల్లోతు ప్రేమలో ఉందనే టాక్ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఈమె బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ను నాలుగు ఏళ్లుగా హ్యాండిల్ చేస్తున్నాడు బంటీ. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమ ముదిరి పాకన పడిందట. తన లవర్ ను పెళ్లి చేసేందుకు ఇంట్లోవాళ్లను ఒప్పించిదట కూడా. ఫిబ్రవరి మధ్యలో నిశ్చితార్ధం జరగనుందని తెలుస్తోంది. అయితే.. సోనాక్షికూడా ఈ వార్తలను ఖండించింది.

ఇలాంటి పుకార్లు ప్రచారం చేసేవారు ఎవరో తెలిస్తే వాళ్లను అసలు వదిలిపెట్టదట. అయితే కొన్ని వారాలుగా బంటీ కుటుంబ సభ్యులతో కలిసి సోనాక్షి ఎక్కువగా కనిపిస్తుండడం ఈ ప్రచారానికి బలాన్ని ఇస్తోంది. అయితే.. నిశ్చితార్ధం తంతు పూర్తయ్యాకే ఈ విషయాన్ని బయటకు వెల్లడించాలని భావిస్తున్నారట సోనాక్షి-బంటీల కుటుంబ సభ్యులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/