Begin typing your search above and press return to search.

ఫ్లాప్ సాక్షిగా హీరోయిన్ వేదాంతం

By:  Tupaki Desk   |   25 April 2017 4:31 AM GMT
ఫ్లాప్ సాక్షిగా హీరోయిన్ వేదాంతం
X
దబాంగ్ హీరోయిన్ అనే నీడ నుండి పూర్తిగా బయటపడి తనదైన ముద్ర కోసం సోనాక్షి సిన్హా ప్రయత్నం చేస్తోంది. ఈమె తాజాగా నటించిన చిత్రం ‘నూర్‌’ బాక్సాఫీసు వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో సోనాక్షి కాస్త నిరుత్సాహపడింది. సినిమా సక్సెస్ ని ఫైల్యూర్ ని సోనాక్షి ఎలా తీసుకుంటుంది అనేది ఆమె మాటలు లోనే చూద్దాం.

“అన్నీ సినిమాలలో అందరినీ మెప్పించడం కష్టం. కొన్ని వర్క్ ఔట్ అవుతాయ్ కొన్ని కావు. కొన్నిసినిమాలకు మనం అనుకున్న స్థాయిలో లేకపోయినా చేయక తప్పదు. అదే రియాలిటీ అంటే. నిజాన్ని మనం గ్రహించి అడుగులు వేయవలిసి వస్తుంది. నా కెరీర్ మొదటిలో నేను నేర్చుకున్న మొదటి పాఠం ఆదే. ముందు మనం మనతో సంతోషంగా ఉంటే అప్పుడు అది పని పై మంచి ప్రభావం చూపుతుంది'' అంటూ వేదాంతం వల్లించేసింది అమ్మడు.

ఇంకా కొన్ని విషయాలు మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు అలా అని ప్రయత్నించడం మనకూడదట. ''మా నాన్న శత్రుజ్ఞ సిన్హా సక్సెస్ ఫెయిల్యూర్ రెండూ సమానంగా చూసేవారు. చాలా హుందాగా ఉండేవారు. ఆయన నుండి అది నేను బాగా వంటపట్టించుకున్నాను. బాద పడితే గాని బోదపడదు అని ఉరికే అనలే'' అంటూ అమ్మడు చెబుతోంది. మొత్తానికి మరో ఫ్లాప్ ను చాలా ఈజీగా తీసుకుందీ హీరోయిన్. అయినా కంగనా రనౌత్ చెప్పినట్లు.. ఫ్లాప్ అయినా కూడా ఈ స్టార్ కిడ్స్ కు అవకాశాలు వస్తూనే ఉంటాయిగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/