Begin typing your search above and press return to search.

సెక్స్ గురించి హీరోయిన్ తెగ స్పీచ్ లు!

By:  Tupaki Desk   |   1 Aug 2019 2:24 AM GMT
సెక్స్ గురించి హీరోయిన్ తెగ స్పీచ్ లు!
X
ఇటీవ‌ల‌ సినిమా క‌థల్లో వ‌స్తున్న మార్పు అనూహ్య‌మైన‌ది. కొత్త పంథా క‌థ‌ల్ని తెర‌పై ఆవిష్క‌రించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ప్ర‌తిదాంట్లో వినోదంతో పాటు చ‌క్క‌ని సందేశాన్ని జోడిస్తున్నారు. స‌మాజంలో ఏదైనా బ‌ల‌మైన స‌మ‌స్య‌ను ఇతివృత్తంగా ఎంచుకుని దానిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న త‌ప‌న‌ను క‌న‌బ‌రుస్తున్నారు. ప‌రిస‌రాల‌ ప‌రిశుభ్ర‌త‌- మ‌ల విస‌ర్జ‌న‌.. ఆడాళ్ల రుతుస్రావం లాంటి హిడెన్ టాపిక్స్ ని ఎంచుకుని కిలాడీ అక్ష‌య్ కుమార్ చేసిన ప్ర‌యోగాల్ని ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు.

ఆ త‌ర‌హాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. షాట్ గ‌న్ శ‌త్రుఘ్న సిన్హా వార‌సురాలు సోనాక్షి సిన్హా ఈ త‌ర‌హాలో క్రేజీ స్క్రిప్టుల‌ను ఎంపిక చేసుకుని ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హించ‌డం ఆస‌క్తిక‌రం. తాజాగా సోనాక్షి ప్ర‌ధాన పాత్ర‌లో `ఖాందానీ సఫాఖానా` రిలీజ్ కి రెడీ అవుతోంది. శిల్పి దేశ్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్ నిర్మాత. వరుణ్ శర్మ- అన్ను కపూర్- బాద్ షా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుందియాల్ ప్రొడక్షన్స్- టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. `సెక్స్` గురించి తల్లిదండ్రుల‌తో మాట్లాడేందుకు యువ‌త‌రం ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌దు. త‌ల్లిదండ్రులు ఆ చ‌నువు తీసుకోవ‌డం లేదు. స‌హ‌చ‌రులు స్నేహితుల‌తో మాట్లాడినంత చ‌నువుగా త‌ల్లిదండ్రుల‌తో నేటిత‌రం పిల్ల‌లు ఎందుకు చ‌ర్చించ‌లేక‌పోతున్నారు? అన్న ఆస‌క్తిక‌ర పాయింట్ ని ఎంచుకుని ఈ సినిమా తీస్తున్నారు.

త్వ‌ర‌లోనే రిలీజ్ కి వ‌స్తున్న సంద‌ర్భంగా క‌థానాయిక‌ సోనాక్షి `సెక్స్` గురించి బోల్డ్ గా మాట్లాడేస్తూ బోలెడంత ప్ర‌చారం చేస్తోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో .. సెక్స్ అన్న టాపిక్ ని ప్ర‌స్థావిస్తూ ప్ర‌త్యేకించి ఆ పాయింట్ ని నొక్కి మాట్లాడింది. ``నేను కూడా మా నాన్న గారితో అలాంటి విష‌యాలు మాట్లాడ‌ను. నేనే కాదు .. భార‌త‌దేశంలో పిల్ల‌లంతా ఇలానే చేస్తున్నారు. అలా కాకుండా త‌ల్లిదండ్రులే చొర‌వ తీసుకుని పిల్ల‌ల‌తో సెక్స్ గురించి ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల గురించి మాట్లాడాలి`` అంటూ క్లాస్ తీస్కుంది. ఋతుస్రావం.. బహిరంగ మల విసర్జన .. ఈ త‌ర‌హాలోనే సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడ‌డం అన్న టాపిక్ తో సోనాక్షి హీట్ పెంచుతోంది. కాలేజ్.. స్కూల్ ద‌శ‌లో తాను స్నేహితుల నుంచే సెక్స్ గురించి ఎక్కువ తెలుసుకున్నాన‌ని త‌ల్లిదండ్రుల ద్వారా త‌న‌కు ఎంత‌మాత్రం తెలియ‌లేదని సోనాక్షి ఈ ప్ర‌చారంలో అన్నారు. మొత్తానికి ప్ర‌చారార్భాటంతో ఈ సినిమాకి బోలెడంత ప్ర‌చారం తెస్తోంది.