Begin typing your search above and press return to search.
అడవిబిడ్డ అవతారంలో సోనాక్షి..
By: Tupaki Desk | 13 Jan 2016 12:29 PM GMTబాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రతీ విషయంలోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు పాకులాడుతూ ఉంటుంది. సినిమాల్లో కేరక్టర్లు రెగ్యులర్ గా ఉన్నా.. ఈమె అవతారాలు, ఫ్యాషన్ ట్రెండ్ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ట్రెండ్ కి విభిన్నంగా ఉంటూ.. తన ప్రత్యేకతను నిలబెట్టుకునే సోనాక్షి.. ఓ కేలండర్ పై కూడా డిఫరెంట్ గెటప్ తో మెరిసిపోతోంది.
సాధారణంగా కేలండర్ గాళ్ అంటే.. అందాలు ఆరబోస్తూనో.. ఫ్యాషన్ కు అర్ధం చెప్పేట్టుగానే రెడీ అయిపోతారు భామలు. కానీ డబ్బూ రత్నాని 2016 కేలండర్ లో సోనాక్షి సిన్హా ట్రైబల్ గెటప్ తో ఆకట్టుకుంటోంది. ఈ కేలండర్ అంతా అందమైన భామలే నిండిపోయినా.. అందరిలోకీ సోనాక్షి ప్రత్యేకంగా కనిపించడానికి కారణం ఆమె వేసిన ట్రైబల్ గెటప్పే. ముఖంపై రంగు రంగుల బొట్లు, చేతికి మెడలోనూ, అనేక కలర్స్ ఉన్న సాంప్రదాయ ఆర్నమెంట్స్ తో.. అచ్చమైన అడవిబిడ్డగా అలరిస్తోంది సోనాక్షి.
ఒకవైపు అందంగా కనిపిస్తూనే.. మరోవైపు ఆకర్షణీయంగా ఎలా రెడీ అవ్వాలనే అంశంపై.. అసలు ఈ అమ్మడి దగ్గర ట్రైనింగ్ క్లాసులు తీసుకోవాలని అంటున్నారు చాలామంది. ఏమైనా కేలండర్ గాళ్ అంటే అందాలే కాదు.. కొత్తగా కనిపించి కూడా అందరినీ ఆకట్టుకోవచ్చనే కొత్త ట్రెండ్ కి సోనాక్షి సిన్హా శ్రీకారం చుట్టింది.