Begin typing your search above and press return to search.
మోసపోయిన హీరోయిన్
By: Tupaki Desk | 12 Jun 2019 5:30 PM GMTటెక్నాలజీ పెరిగినా కొద్ది సైబర్ నేరాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు సైబర్ నేరగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. ఈసారి హీరోయిన్ సోనాక్షి వర్మ ను ఒక సైబర్ నేరగాడు చీటింగ్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. తాను 85 వేల రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చి మోసపోయాను అంటూ హీరోయిన్ సోనాక్షి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... హీరోయిన్ సోనాక్షి వర్మకు ఇటీవల ఒక నైజీరియన్ నుండి ఫేస్ బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఓకే చేసిన సోనాక్షి అతడితో కొన్నాళ్లు ఛాటింగ్ కూడా చేసింది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే సోనాక్షిని అతడు బురిడి కొట్టించాడు. నైజీరియా నుండి ఒక ఖరీదైన బహుమానంను పంపుతున్నట్లుగా ఫోన్ లో తెలియజేశాడు. ఆ బహుమానం అందుకోవాలని సూచించాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి కాల్ చేస్తున్నామంటూ ఒక వ్యక్తి మాట్లాడుతూ మీకు ఒక గిఫ్ట్ ప్యాక్ వచ్చింది. అది మీకు రావాలి అంటే 85 వేల రూపాయలు మాకు చెల్లించాల్సి ఉంటుంది అంటూ చెప్పాడు. కస్టమ్స్ వారికి చెల్లించాల్సిన పన్ను అయ్యి ఉంటుందని భావించి సోనాక్షి వర్మ ఆన్ లైన్ ద్వారా అతడు చెప్పిన నెంబర్ కు డబ్బును పంపించింది. డబ్బు పంపి వారం రోజులు అయినా గిఫ్ట్ రాకపోవడంతో అతడి నెంబర్ కు కాల్ చేయగా స్విచ్చాఫ్ అని వస్తుంది. దాంతో తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.