Begin typing your search above and press return to search.

బాయ్‌ ఫ్రెండ్స్‌ తో చేదు అనుభవాలున్నాయట

By:  Tupaki Desk   |   13 Dec 2015 3:30 PM GMT
బాయ్‌ ఫ్రెండ్స్‌ తో చేదు అనుభవాలున్నాయట
X
బాయ్ ఫ్రెండ్.. ఈ మాటే తన దగ్గర ఎత్తొద్దని అంటోంది సోనాల్ చౌహాన్. ‘రెయిన్ బో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ‘లెజెండ్’ తర్వాత బిజీ అయిన ఈ భామకు బాయ్ ఫ్రెండ్స్‌ తో కొన్ని చేదు అనుభవాలున్నాయట. అందుకే తన దగ్గర ఆ సంగతే ఎత్తొద్దని అంటోంది. ‘‘అందర్లోనే నేనూ ఓ వయసు రాగానే అబ్బాయిలకు ఆకర్షితురాలినయ్యాను. కానీ ప్రేమ విషయంలో నాకు కొన్ని చేదు అనుభవాలున్నాయి. అందుకే ఇప్పుడిప్పుడే ఇంకెవరినీ నా జీవితంలోకి ఆహ్వానించే ఉద్దేశం నాకు లేదు’’ అని చెప్పింది సోనాల్. ఇంతకీ నీకు ఎలాంటి వాడు కావాలి అని అడిగితే.. ‘‘మాట మర్యాదగా ఉండాలి. ఆడవాళ్లను గౌరవించే సంస్కారం ఉండాలి. నాలాగా ఫాస్ట్ ఫుడ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు ఏదైనా లాగించేయాలి’’ అంటూ చిట్టా విప్పింది సోనాల్.

తాను సినిమాల్లోకి రావడం చాలా అనూహ్యంగా జరిగిందని సోనాల్ వెల్లడించింది. ‘‘అనుకోకుండా జరిగిన ఓ సంఘటన నన్నింత దూరం నడిపించింది. 17 ఏళ్ల వయసులో ఓ కాఫీ షాపుకి వెళ్లాను. అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ నేను క్యూట్ గా ఉన్నానంటూ ఫొటో తీశాడు. అది పత్రికలో వచ్చింది. ఆ ఫొటోకు మంచి పేరు రావడంతో మలేషియాలో జరిగిన మిస్ వరల్డ్ టూరిజం పోటీలో పాల్గొని టైటిల్ గెలుచుకున్నా. తర్వాత మోడలింగ్ అవకాశాలు, సినిమా ఛాన్సులు వాటంతట అవే వచ్చాయి’’ అని చెప్పింది సోనాల్. తనకు రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉందని.. భవిష్యత్తులో రాజకీయ నాయకురాలినైనా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదని సోన్ చెప్పింది.