Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఎద అందాలతో మతులు పోగొడుతున్న బాలయ్య హీరోయిన్‌

By:  Tupaki Desk   |   3 March 2022 10:30 AM GMT
ఫోటోటాక్ : ఎద అందాలతో మతులు పోగొడుతున్న బాలయ్య హీరోయిన్‌
X
2008 సంవత్సరంలో రెయిన్‌ బో అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్‌. ఆ సినిమా పెద్దగా తెలుగులో ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దాంతో కన్నడం మరియు హిందీ భాషల్లో ఈమె సినిమాల ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసింది. అక్కడ అడపా దడపా ఆఫర్లు వస్తున్న సమయంలో అనూహ్యంగా 2014 సంవత్సరంలో బాలయ్యకు జోడీగా లెజెండ్‌ సినిమాలో ఈ అమ్మడు నటించే అవకాశం దక్కించుకుంది.

లెజెండ్‌ సినిమా తో హీరోయిన్ గా మెప్పించిన సోనాల్‌ చౌహన్ కు అనూహ్యంగా వరుస ఆఫర్లు వచ్చాయి. లెజెండ్‌ సూపర్‌ హిట్‌ అవ్వడం వల్ల తెలుగు లో ఈ అమ్మడు బిజీ అయ్యింది. పండుగ చేస్కో.. షేర్‌.. సైజ్ జీరో ఇంకా కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. బాలయ్య తోనే ఈమె మరో సారి డిక్టేటర్ సినిమాను కూడా చేసింది. లెజెండ్‌ మరియు పండుగ చేస్కో సినిమాలు తప్ప మరే సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. దాంతో ఈమెకు ఆఫర్లు సన్నగిల్లాయి.

తెలుగు లో ఆఫర్లు తగ్గడంతో మళ్లీ తమిళం మరియు హిందీలో ప్రయత్నాలు చేసింది. 2018 సంవత్సరంలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా కెరీర్‌ ను అలా అలా నెట్టుకు వస్తుంది. ఈ ఏడాది ఎఫ్ 3 తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సారి అయినా ఈ అమ్మడికి సక్సెస్ దక్కుతుందా అనేది చూడాలి. సినిమాలో ఈమె ఆకట్టుకోలేక పోతున్నా కూడా ఫోటోలతో మాత్రం కుమ్మేస్తోంది.

హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోలేక పోతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో హౄట్‌ ఫోటో లు షేర్‌ చేయడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంటుంది. హీరోయిన్ గా ఈ ఫోటో షూట్‌ లు మళ్లీ ఆఫర్లు తెప్పిస్తాయనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు లెక్కలు వేసుకుని మరీ అందాల ఆరబోత చేస్తుందేమో అనిపిస్తుంది.

తాజాగా ఈ అమ్మడు మరోసారి అందాల విందు చేసింది. తన ఎద సౌందర్యం ను సాధ్యం అయినంతగా చూపించడంతో పాటు థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా కూడా ఈమె స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ అన్నట్లుగానే కామెంట్స్ వస్తున్నాయి. మళ్లీ ఈమెకు ముందు ముందు అయినా ఆఫర్లు వస్తాయనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.