Begin typing your search above and press return to search.
సోనాల్ చౌహన్ స్పీడ్ పెంచిందే!
By: Tupaki Desk | 26 Sep 2022 5:35 AM GMTసోనాల్ చౌహాన్ కటౌట్ చూసి పెద్ద హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ అమ్మడి కెరీర్ అలా సాగలేదు. కెరీర్ ప్రారంభమై దశాబ్ధం దాటినా నత్తనడకనే సాగుతోంది. సెకెండ్ లీడ్స్ సైతం కానాకష్టంగా దక్కించుకుంటుంది. స్టార్ హీరోలందరిలో నటసింహ బాలకృష్ణ ప్రోత్సహించడంతోనే ఇప్పటికీ అమ్మడి పేరు తెలుగులో వినిపిస్తుంది.
లెజెండ్..డిక్టేటర్..రూలర్ లాంటి చిత్రాల్లో బాలయ్య అవకాశం కల్పించడంతోనే ఐడెంటిటీని దక్కించుకోగల్గింది. ఆ తర్వాత ఇటీవలే 'ఎఫ్-3' చిత్రంలోనూ ఛాన్స్ అందుకుంది. ఇవన్నీ అమ్మడికి కాస్తో..కూస్తో పేరు తీసుకొచ్చాయి. తాజాగా అమ్మడి జోరు చూస్తే వేగం పెంచినట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం నాగార్జున సరసన 'ది ఘోస్ట్' లో నటిస్తుంది. ఇది అమ్మడికి లక్కీ ఛాన్స్ అని చెప్పాలి.
ఇదే పాత్రకు ముందుగా కాజల్ అగర్వాల్..అమలాపాల్ వంటి భామల్ని సంప్రదించారు. కానీ వాళ్లిద్దరు అధిక పారితోషికం డిమాండ్ చేయంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారు. దీంతో ఆ ఛాన్స్ సోనాల్ ని వరించింది. ఆ రకంగా నిర్మాతల హీరోయిన్ గానూ నిలిచింది. నమ్మి కల్పించిన అవకాశాన్ని నూరు శాతం సద్వినియోగం చేసుకుంది అన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది.
'ఘోస్ట్' లో యాక్షన్ సన్నివేశాల్లో సోనాల్ సైతం విశ్వరూపం చూపించిందిట. యాక్షన్ సన్నివేశాల్లో తనదైన శైలిలో మెప్పించడం ఖాయమంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకు మంచి హైప్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటికి సోనాల్ మార్క్ పెర్పార్మెన్స్ తోడవ్వడం సినిమాకి అదనంగా కలిసొచ్చింది. అలాగే ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్' లో సైతం సోనాల్ చౌహన్ నటిస్తోంది.
పాత్ర చిన్నదైనా తెరపై కనిపించినంత సేపు ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమాతో అమ్మడు అన్ని భాషలకు పరిచయం అవుతుంది. తద్వారా మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రకంగా సోనాల్ బిజీ నాయికగా మారుతున్నట్లే కనిపిస్తుంది. శక్తి వంచన లేకుండా శ్రమిస్తే అవకాశాలు వస్తాయని సోనాల్ రుజువు చేస్తోంది.
అలా సక్సెస్ అవ్వాలంటే ? ఎంతో ఓపిక సహనం సైతం అంతే అవసరమని గుర్తించాలి. గతంతో పోల్చుకుంటే సోనాల్ వేగం పెంచిదని చెప్పొచ్చు. ఇవన్నీ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు మాత్రమే. ఆమెకు ఆమెగా ఏనాడు ఛాన్స్ లివ్వండని అభ్యర్ధించింది లేదు. సరైన సమయం కోసం ఎదురుచూసింది. వచ్చిన అవకాశాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.