Begin typing your search above and press return to search.

సోనాల్ .. ప‌డ‌క‌గ‌దిలో ఆ సెగ‌లేమిటో!

By:  Tupaki Desk   |   2 July 2020 4:45 AM GMT
సోనాల్ .. ప‌డ‌క‌గ‌దిలో ఆ సెగ‌లేమిటో!
X
హిందీ బ్యూటీ‌ సోనాల్ చౌహ‌న్ ఇంత‌కీ ఏమైంది? తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌ను ఆదుకునే హీరోలు ద‌ర్శ‌కులు ఉన్నా ఎందుక‌నో రేసులో వెన‌క‌బ‌డిపోయిందేమిటో! హ్యాపీడేస్ రాహుల్ స‌ర‌స‌న నటించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత బాల‌య్య స‌ర‌స‌న రెండు మూడు చిత్రాల్లో న‌టించింది. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి వ‌ర‌స‌గా త‌న సినిమాల్లో అవ‌కాశం ఇచ్చి ప్రోత్స‌హించాడు. కానీ ఏం లాభం? ఆశించిన స్థాయికి మాత్రం కెరీర్ ని మ‌లుచుకోవ‌డంలో త‌డ‌బ‌డింది.

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ `పండ‌గ‌చేస్కో` లో ఛాన్స్ ద‌క్కినా అది యావ‌రేజ్. నంద‌మూరి కాంపౌండ్ హీర్ క‌ళ్యాణ్ రామ్ `షేర్` అనే మూవీలో ఛాన్స్ ఇచ్చినా అది డిజాస్ట‌ర్ అవ్వ‌డం మైన‌స్ అయ్యింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బాల‌య్య డిక్టేట‌ర్.. రూలర్ లాంటి చిత్రాల్లో లిప్ట్ ఇచ్చినా ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. సోనాల్ ఎక్స్ పోజింగ్.. బికినీ ట్రీట్ ఎంత‌మాత్రం త‌న‌కు ప్ల‌స్ కాలేదు. గ్లామ‌ర్ ఎలివేష‌న్ కే ఈ అమ్మ‌డు సూట‌బుల్ అన్న అభిప్రాయం త‌న‌కు మైన‌స్ గా మారింది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ట్రీట్ తో ట‌చ్ లో ఉంది. తాజాగా సోనాల్ త్రోబ్యాక్ ఫోటో ఒక‌టి జోరుగా వైర‌ల్ అవుతోంది. ప‌డ‌క‌గ‌దిలో విర‌హ క‌న్య‌లా చెల‌రేగిపోయిన ఆ త్రోబ్యాక్ ఫోటో జోరుగానే వైర‌ల్ అయ్యింది. ఇలాంటి ట్రీట్ పెద్ద‌తెర‌పై కొత్తేమీ కాదు కానీ .. ఇలా ప్ర‌యివేట్ ఫోటోల‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ ట్రీటిస్తోంది ఈ అమ్మ‌డు. ఇంత‌గా చెల‌రేగినా ఈ భామ‌కు అంత డిమాండ్ అయితే లేదు ఎందుక‌నో.