Begin typing your search above and press return to search.
ఘోస్ట్ పై సోనాల్ ఆశలు భారీ నుంచి అతి భారీగా!
By: Tupaki Desk | 30 Sep 2022 1:30 AM GMTబాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ తెలుగు సినిమా 'ది ఘోస్ట్' పై భారీ నుంచి అతి భారీ ఆశలు పెట్టుకుందా? ఈ సినిమాని కెరీర్ టర్నింగ్ ఆవకాశంగా భావిస్తోందా? లేటు అయినా లేటెస్ట్ హిట్ తో టాలీవుడ్ ని మెప్పిస్తాను? అన్న ధీమా అమ్మడిలో కనిపిస్తుందా? అంటే అవుననే వినిపిస్తుంది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. 'రెయిన్ బో' సినిమాతో పరిచయమైంది.
అటుపై 'లెజెండ్'..'పండగ చేస్కో'..'షేర్'..'డిక్టేటర్'..'రూలర్'..'ఎఫ్-3' లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవన్నీ అమ్మడికి సెకెండ్ లీడ్ రోల్స్ మాత్రమే. మెయిన్ లీడ్ లో ఏ దశలోనూ ఇంతవరకూ ఛాన్స్ రాలేదు. అలా రాకరాక వచ్చిన అవకాశమే ది ఘోస్ట్. ఈ సినిమాలో అమ్మడు కింగ్ నాగార్జున సరసన నటిస్తుంది. ఆయనతో పాటు సాహసోపేతోమైన యాక్షన్ సన్నివేశాలో పోటా పోటీగా నటిస్తుంది.
ఇంతవరకూ బ్యూటీకి ఇలాంటి ఛాన్స్ రాలేదు. సెకెండ్ లీడ్ కే పరిమితమైంది తప్ప! ముఖ్య భూమిక పోషించే అవకాశం రాలేదు. ఆమాత్రమైనా ? తెలుగు తెరపై మెరవడానికి కారణం నటసింహ బాలకృష్ణ. ఆయన చలవ కారణంగా బాలయ్య నటించిన మూడు చిత్రాల్లోనూ సెకెండ్ లీడ్స్ లో నటించి టాలీవుడ్ లో వెల్ నోన్ భామగా మారింది. మళ్లీ నాగ్ తో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.
'ఘోస్ట్' పై సోనాల్ చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా తో హిట్ అందుకుని టాలీవుడ్ లో బిజీ అవ్వాలని భావిస్తోంది. సక్సెస్ వస్తుందని ఆశించిన ప్రతీ సారి అమ్మడికి భంగపాటే ఎదురైంది. వచ్చిన రెండు..మూడు విజయాల్లోనైనా కీలక పాత్ర పోషించలేకపోయింది.
అలా అమ్మడికి సోలో సక్సెస్ మాట పక్కనబెడితే..సెకెండ్ లీడ్ ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్రయత్నంగానే మిగిలిపోయింది. అందుకే 'ది ఘోస్ట్' లో రిస్క్ సన్నివేశాల్ని సైతం రస్క్ తీసుకున్నంత ఈజీగా చేసేసింది.
మరి అమ్మడి ఆశలు..అంచనాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న 'ఆదిపురుష్' లో నూ సోనాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్రకే పరిమితం. ప్రభాస్ సరసన మెయిన్ లీడ్ సీత పాత్రని కృతి సనన్ పోషిస్తుంది కాబట్టి సోనాల్ కి అంత స్కోప్ ఉండదు. సక్సెస్ అయినా క్రెడిట్ దక్కడం కష్టం. ఆ సక్సెస్ ని ఓ అవకాశంగానే భావించాలి. ఏదైనా టాలీవుడ్ ఆశలన్నీ ప్రస్తుత ఘోస్ట్ పైనే ఆధారపడ్డాయన్నది వాస్తవంగా కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.