Begin typing your search above and press return to search.

మీటూ : బలవంతంగా డ్రస్‌ తీసి - క్రీమ్‌ రాశాడు

By:  Tupaki Desk   |   25 Oct 2018 12:30 PM GMT
మీటూ : బలవంతంగా డ్రస్‌ తీసి - క్రీమ్‌ రాశాడు
X
బాలీవుడ్‌ లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంతో మంది హీరోయిన్స్‌, బుల్లి తెర నటీమణులు ఇంకా మహిళలు తమపై జరిగిన లైంగిక దాడిని గురించి మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రెటీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మరో నటి సోనాల్‌ వెంగురేల్కర్‌ మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చింది. డైరెక్టర్‌ రాజా బజాజ్‌ పై ఈమె చేసిన లైంగిక వేదింపుల ఆరోపణలు షాకింగ్‌ గా ఉన్నాయి. అత్యంత దారుణంగా, నీచంగా రాజా బజాజ్‌ తన పట్ల వ్యవహరించాడంటూ ఆమె చేస్తున్న ఆరోపణలు ఒల్లు గగుర్లు పొడిచేలా చేస్తున్నాయి.

తాజాగా సోనాల్‌ వెంగురేల్కర్‌ మాట్లాడుతూ.. ఆన్‌ లైన్‌ లో రాజా బజాజ్‌ ఇచ్చిన ఒక ప్రకటన చూసి 2012వ సంవత్సరంలో ఆడిషన్స్‌ కోసం అతడి ఆఫీస్‌ కు వెళ్లాను. అక్కడ ఆయనతో పాటు ఒక ఫొటోగ్రాఫర్‌ కూడా ఉన్నారు. ఆ ఫొటోగ్రాఫర్‌ తో కలిసి రాజా తనను లైంగికంగా వేదించాడు. ఫొటో షూట్‌ కోసం మొదట నా డ్రస్‌ తీసేయమన్నారు. షాక్‌ అయిన నేను ఆలోచిస్తున్న లోపే రాజా నా వద్దకు వచ్చి బలవంతంగా డ్రస్‌ తొలగించాడు. నాకు తాంత్రిక పూజలు తెలుసు. ఓవర్‌ నైట్‌ లో నిన్ను స్టార్‌ ను చేస్తానంటూ చెప్పాడు. నా అనుమతి లేకుండానే నా డ్రస్‌ తీసి ఫొటోలు తీశారు.

అదే సమయంలో మరో మోడల్‌ తో ఆడిషన్స్‌ చేస్తూ నాకు ఒక క్రీమ్‌ ఇచ్చి చెస్ట్‌ మరియు నడుము భాగంలో పూసుకోవాలని చెప్పారు. కాని నేను అందుకు ఒప్పుకోక పోవడంతో కొద్ది సేపటి తర్వాత ఆయన వచ్చి బలవంతంగా క్రీమ్‌ పూశాడు అంటూ సోనాల్‌ చెప్పుకొచ్చింది. నరకయాతన పెట్టిన రాజా పై నేను అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. కాని ఆయనకున్న పలుకుబడితో కేసు గురించి బయటకు రాకుండా చేసుకున్నాడు. నేను అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త అవ్వడం వల్ల ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. దాంతో నేను వదిలేశాను అంది.

సోనాల్‌ చేస్తున్న లైంగిక వేదింపుల ఆరోపణలను డైరెక్టర్‌ రాజా బజాజ్‌ కొట్టి పారేశాడు. సోనాల్‌ కు అప్పట్లో మేము అడిగిన డబ్బు ఇవ్వలేదు. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నాడు.