Begin typing your search above and press return to search.

అయ్యో.. సొనాలి బింద్రేకు క్యాన్సర్ సోకింది

By:  Tupaki Desk   |   4 July 2018 8:38 AM GMT
అయ్యో.. సొనాలి బింద్రేకు క్యాన్సర్ సోకింది
X
ఒకప్పుడు తన క్యూట్ లుక్స్ తో ఉర్రూతలూగించిన భామ సొనాలి బింద్రే. మురారి.. శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఓ పదిహేనేళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నాక సినిమాలుక దూరమైంది. కాని ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి ఏదన్నా మంచి పాత్రతో ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే.. అమ్మడు షాకింగ్ న్యూస్ చెప్పింది.

తనకు క్యాన్సర్ ఉందంటూ ఈ ఉదయం సొనాలి బింద్రే స్వయంగా ట్వీట్ చేసింది. 'ఒక్కోసారి జీవితం అనుకోకుండా మనకు సవాల్ విసురుతుంది. ఏదో చిన్న నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. చాలా టెస్టులు చేశాక తెలిసింది ఏంటంటే.. ఒక హై గ్రేడ్ క్యాన్సర్ ఉందంట. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ కోసం నేను న్యూయార్క్ వచ్చేశాను. దీనిని ధైర్యంగా ఎదుర్కోవడం తప్పించి ఇంకో దారేలేదు' అంటూ తెలిపింది సొనాలి. అయితే సడన్ గా ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలా చెప్పడంతో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ షాక్ కు గురైంది.

మొన్ననే ఇర్ఫాన్ ఖాన్ తనకు క్యాన్సర్ ఉందని చెప్పడంతో.. ఆల్రెడీ బాలీవుడ్ షాకులో ఉంది. ఇప్పుడు అదే తరహాలో సోనాలి కూడా చెప్పడంతో అందరూ కాసింత గందరగోళం చెందుతున్నారు. ఒకప్పుడు రామానాయుడు.. ధర్మవరపు.. ఆహుతి ప్రసాద్ ల క్యాన్సర్ న్యూస్ ఎలా టాలీవుడ్డును కలవరపెట్టేసిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది.