Begin typing your search above and press return to search.

అప్పుడు నవ్వినా నొప్పినే అనుభవించా..!

By:  Tupaki Desk   |   9 Oct 2018 12:23 PM GMT
అప్పుడు నవ్వినా నొప్పినే అనుభవించా..!
X
బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సోనాలీ బింద్రే గత కొంత కాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా అమెరికాలో క్యాన్సర్‌ కు చికిత్స తీసుకుంటూ అక్కడే ఉన్న సోనాలీ తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు మరియు సన్నిహితులకు తెలియజేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సొనాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ పేర్కొన్నారు. తాజాగా ఒక పోస్ట్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సోనాలి మరోసారి గుండెలను పిండేసింది.

చికిత్స సమయంలో చాలా నొప్పిగా ఉంటుందని, ఆ సమయంలో నేను కనీసం నా వేలును కూడా కదిలించలేని పరిస్థితిలో ఉండేదాన్ని. చికిత్స జరుగుతున్న సమయంలో నేను పూర్తిగా బలహీన పడిపోయా, అప్పుడు నవ్వినా కూడా నాకు విపరీతమైన నొప్పిగా ఉండేదని, చికిత్స సమయంలో ప్రతి సెకను కూడా నాతో నేను ఎంతో పోరాటం చేసినట్లుగా ఆమె సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. పోస్ట్‌ తో పాటు ఆమె గుండుతో ఉన్న ఫొటోను కూడా పోస్ట్‌ చేసి అందరి హృదయాలను ద్రవింపజేసింది.

జీవింతలో మంచి చెడు, సంతోషం కష్టం ఉంటుంది. వాటిని బ్యాలన్స్‌ చేసుకుంటూ వెళ్లాలని సోనాలి తన పోస్ట్‌ లో పేర్కొంది. తెలుగులో ‘మురారి’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించిన సోనాలి బింద్రే బాలీవుడ్‌ లో సెటిల్‌ అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేది. బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా సొనాలి త్వరగా క్యాన్సర్‌ నుండి కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.