Begin typing your search above and press return to search.
కలలా ఉంది.. కెమెరా ముందుకు వస్తాననుకోలేదు
By: Tupaki Desk | 4 Feb 2019 8:53 AM GMTతెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన సోనాలి బింద్రే హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే బుల్లి తెరపై కనిపిస్తూ వచ్చింది. ఇంతలోనే ఆమెకు క్యాన్సర్ ఎటాక్ అయ్యింది. క్యాన్సర్ విషయం వెంటనే తెలియడంతో ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లింది. న్యూయార్క్ లో చాలా కఠినమైన చికిత్స సోనాలి పొందిన విషయం అందరికి తెలిసిందే. తన చికిత్స గురించి, తాను ఎదుర్కొన్న మానసిక వేదన గురించి సోనాలి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ ద్వారా చెబుతూ వచ్చింది.
క్యాన్సర్ మొదటి దశ చికిత్సను పూర్తి చేసుకుని ఇటీవలే ముంబయి చేరుకున్న సోనాలి బింద్రే మామూలు మనిషి అయ్యింది. క్యాన్సర్ వల్ల జుట్టు తీసేయించుకున్న సోనాలి మొహంలో మాత్రం మునుపటి గ్లో అలాగే ఉందని టాక్ వస్తుంది. క్యాన్సర్ ను జయించిన సోనాలి మళ్లీ కెమెరా ముందుకు వెళ్లిందట. తాజాగా ఒక షూటింగ్ లో పాల్గొన్నానంటూ ఇన్ స్టాలో సోనాలి పేర్కొంది. అంతా కలలా ఉంది, మళ్లీ ఇలా కెమెరా ముందుకు వస్తానని నేను అనుకోలేదు. అసలు జీవితమే అయిపోయిందనుకున్న సమయంలో నేను మళ్లీ ఇలా రావడం నిజంగా కలలా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.
సోనాలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమె సినిమాల్లో నటించే అవకాశం లేదు. ఆమె ఒక బుల్లి తెర షో కోసం గెస్ట్ గా వెళ్లి ఉంటుందని, ఆ షో గురించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడవుతాయని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. త్వరలో రెండవ దశ చికిత్స కోసం వెళ్లి వచ్చిన తర్వాత సోనాలి సినిమాల్లో నటించే అవకాశం కూడా ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.