Begin typing your search above and press return to search.
క్యాన్సర్ పై సోనాలి బింద్రే ఆసక్తికర వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 23 Feb 2022 12:30 AM GMTసోనాలి బింద్రే క్యాన్సర్ జబ్బుతో పెద్ద యుద్దమే చేసారు. శరీరానికి క్యాన్సర్ సోకడంతో ఎంతగా మానసిక వేదనకు గురయ్యారో తెలిసిందే. అలాగని గుండెబరాన్ని ఏరోజు కోల్పోలేదు. క్యాన్సర్ సోకిన విషయాన్ని ధైర్యంగా ట్విటర్ ద్వారా తెలిపారు. ఆ వెంటనే అమెరికా వె ళ్లిపోయి అక్కడే కొన్నాళ్ల పాటు చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుని ఇండియాకి తిరుగొచ్చారు.
మహమ్మారిని జయించి క్యాన్సర్ బాధితులకు రోల్ మోడల్ గా నిలిచారు. ఇక క్యాన్సర్ చికిత్స ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో...ఆ అనుభవాల్ని అభిమానులతో పంచుకున్నారు. క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. తాజాగా వరల్డ్ క్యాన్సర్ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా సోనాలి బింద్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
``క్యాన్సర్ అనే వైరస్ జీవితాన్ని మరో దారిలోకి తీసుకెళ్తుంది. క్యాన్సర్ బారిన పడిన వాళ్లు మాత్రం జీవితంలో ఎంతో కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్లినట్లే. కానీ జీవితాన్ని మాత్రం ఏ వైరస్ అడ్డుకోలేదు. క్యాన్సర్ రోగుల్ని జాగ్రత్త గా చూసుకోవాలి. తొలి దశలో క్యాన్సర్ ని గుర్తించగల్గితే ఆరోగ్యంగా బయటపడినట్లే. కానీ ముదిరితే దాన్ని తప్పించుకోవడం సులభమైన పని కాదు.
ఈ విషయంలో ఎంతో అవేర్ నెస్ తో ఉండాలి. నేను మరణం అంచుల వరకూ వెళ్లొచ్చాను. ఆ సమయంలో ఎంతో మంది నాకు ధైర్యంగా నిలబడ్డారు. క్యాన్సర్ సోకిన తర్వాత రూపంలో ఎన్నో మార్పులొచ్చాయి. వాటిని చూసుకుని నేను ఏ రోజు కృంగిపోలేదు. జీవితం అనే ప్రయాణం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఎత్తు పల్లాలు ఏ రూపేణా ముందుకు రావొచ్చు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి`` అని అన్నారు.
సోనాలి బింద్రే `మురారి` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `ఇంద్ర` ..`ఖడ్గం` ..`మన్మధుడు` ..`పల్నాటి బ్రహ్మనాడయుడు`..`శంకర్ దాదా ఎంబీబీఎస్` తదితర చిత్రాల్లో నటించారు. తొలుత కెరీర్ ని బాలీవుడ్ లో మొదలు పెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు. 2013 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో హిందీలో కొన్ని టీవీషోల్లో బిజీ అయ్యారు. గతేడాది `సూపర్ డాన్సర్` సీజన్ -4 లో అతిధిగా కనిపించారు.