Begin typing your search above and press return to search.
మాఫియా వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను!- సోనాలి బింద్రే
By: Tupaki Desk | 29 Jun 2022 11:30 AM GMTసోనాలి బింద్రే .. పరిచయం అవసరం లేని పేరు ఇది. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఇంద్ర'లో నటించిన సోనాలి బింద్రే మహేష్ సరసన 'మురారి' లో నాగార్జున సరసన 'మన్మథుడు'లో నటించింది. ఇవన్నీ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే కదిర్ తెరకెక్కించిన 'ప్రేమికుల రోజు' చిత్రంలో సోనాలి బింద్రే నటన యువతరం గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ప్రేమికురాలు అంటే సోనాలి అంత అందంగా ముచ్చటగా ఉండాలని నాటి యూత్ కలలు గన్నారంటే అర్థం చేసుకోవచ్చు.
అటు బాలీవుడ్ లోనూ సోనాలి బింద్రే చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించారు. 90వ దశకంలో సోనాలి బేంద్రే హిందీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా వెలిగారు. 1994లో అరంగేట్రం చేసిన తర్వాత దిల్జాలే-సర్ఫరోష్-హమ్ సాత్ సాథ్ హై-కల్ హో నా హో వంటి బ్లాక్ బస్టర్ లలో నటించారు. ఇటీవల క్యాన్సర్ కి చికిత్స పొంది తిరిగి కోలుకుని నటిగా ప్రయత్నాలు ప్రారంభించారు.
కొద్దిరోజుల క్రితం సోనాలి యూట్యూబ్ పాడ్ కాస్ట్ అయిన 'ది రణవీర్ షో'లో కనిపించారు. ఈ షోలో సోనాలి చేసిన ఒక వ్యాఖ్య ప్రకంపనాలు సృష్టిస్తోంది. 90 లలో బాలీవుడ్ పై మాఫియా ప్రభావం గురించి ఈ వీడియోలో సోనాలి మాట్లాడింది. మాఫియా వల్ల తాను చాలా అవకాశాలు కోల్పోయానని సోనాలి బహిరంగంగా వెల్లడించడం ప్రకంపనంగా మారింది.
అండర్ వరల్డ్ తరచుగా సినిమాలకు ఫైనాన్స్ చేసేదని ఆయా ప్రాజెక్ట్ ల కాస్టింగ్ వ్యవహారాలు సహా ప్రొడక్షన్ పైనా మాఫియా నియంత్రణ కలిగి ఉందని వెల్లడించారు. చాలా క్లీన్ సోర్సెస్ సినిమాలకు ఫైనాన్సింగ్ చేసేవి. కానీ అక్కడ సరైన అధికారిక పరిశ్రమ హోదా లేదు. కాబట్టి ఇండస్ట్రీలోకి చాలా పెద్ద మొత్తంలో క్రమబద్ధీకరించని (చట్టబద్ధం కాని) ఫైనాన్స్ కూడా వచ్చింది'' అని తెలిపారు. ''బ్యాంకులు మీకు(సినిమావాళ్లకు) ఫైనాన్స్ ఇవ్వవు. కాబట్టి అలాంటి ఫైనాన్స్ ని నిర్మాతలు అనుసరించాల్సి వచ్చింది'' అని సోనాలి పేర్కొన్నారు.
అండర్ వరల్డ్ తో ముడిపడి ఉన్న చిత్రనిర్మాతలకు దూరంగా ఉండటానికి తాను ఎప్పుడూ ప్రయత్నించానని.. ఆకతాయిల ఒత్తిడి కారణంగా తాను కొన్ని పాత్రలను కోల్పోయానని కూడా సోనాలి బింద్రే వెల్లడించింది. నేను ఒక పాత్రను చేయవలసి ఉన్నా.. ఎవరైనా మాఫియా నియంత్రణతో అలాంటి ఆఫర్ మరొకరికి వెళ్ళిన సందర్భాలున్నాయి.
ఈ నియంత్రణపై దర్శకుడు లేదా సహ నటుడు నాకు ఫోన్ చేసి ''నాకు ఆ(మాఫియా) ఒత్తిడి ఉంది.. నేను చేయాల్సి ఉంటుంది'' అని చెబుతారు. దాని గురించి ఏం చేయను? నేను అర్థం చేసుకున్నాను.. అని తెలిపారు. సోనాలి ప్రస్తుతం క్యారక్టర్ నటిగా రీలాంచ్ అయ్యేందుకు సీరియస్ గా ప్రయత్నాల్లో ఉన్నారు. తదుపరి పలు చిత్రాల్లో నటించనున్నారని తెలుస్తోంది.