Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లేటు వ‌య‌సు ఘాటు అందాలు!

By:  Tupaki Desk   |   8 Nov 2021 9:30 AM GMT
ఫోటో స్టోరి: లేటు వ‌య‌సు ఘాటు అందాలు!
X
విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `బాబు బంగారం` చిత్రంలో స్పెష‌ల్ అప్పిరియ‌న్స్ ఇచ్చిన పంజాబీ బ్యూటీ సోన‌మ్ బజ్వా టాలీవుడ్ కి సుప‌రిచితురాలే. కానీ ఆ సినిమా ఆడియ‌న్స్ కి అంత‌గా రీచ్ కాక‌పోవ‌డంతో అమ్మ‌డి ట్యాలెంట్ కిల్ అయింది. ఆ త‌ర్వాత తెలుగులో అవ‌కాశాలు కూడా రాలేదు. `ఆటాకుందాం రా `అనే మ‌రో సినిమాలో న‌టించింది గానీ...ఆ సినిమా కూడా ఆశించినంత‌ రీచ్ అవ్వ‌లేదు. అయితే పంజాబీ భాష‌ లో మాత్రం బిజీ న‌టిగానే కొన‌సాగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అడ‌ప‌ద‌డ‌పా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. అయితే స‌క్సెస్ ఆశించిన‌ టాలీవుడ్ లో మాత్రం కుద‌ర‌లేదు. అయినా ప్ర‌య‌త్నాలు వ‌ద‌ల‌లేదు. మాతృభాష‌లో సినిమాలు చేస్తూనే ఇక్క‌డా అవ‌కాశాలు కోసం ఎదురుచూస్తోంది.

ఆ సంగ‌తి ప‌క్క‌బెడితే అమ్మ‌డు ఇటీవ‌ల ఈ సీనియ‌ర్ బ్యూటీ ఇన్ స్టాని ఊపేస్తోంది. సోన‌మ్ లెంహ‌గా లుక్ లో హాట్ బ్యూటీ గా వెలిగిపోతున్న ఓ పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. న‌డుము అందాల్ని ఎలివేట్ చేస్తూ విసిరిన‌ బాణం కుర్రాళ్ల గుండెల్ని మెలితిప్పేస్తోంది. క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అయితే ఈ పిక్ లో సోన‌మ్ కాస్త ఏజ్డ్ గాళ్ గానే క‌నిపిస్తోంది. అమ్మ‌డి వ‌య‌సు 32 అయినా కానీ మేక‌ప్ తో క‌వ‌రప్ కాలేదు.

వ‌య‌సును క‌వ‌ర్ చేస్తూ మేక‌ప్ అద్దేసినా 40 ఏళ్ల‌ భామ‌లాగా క‌నిపిస్తోంది. మేక‌ప్ లోప‌మా? లేక సోన‌మ్ వ‌య‌సు దాచేసి ఇలా దోబుచులాడుతుందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇటీవ‌లి కాలంలో ముదురు భామ‌లంతా వ‌య‌సు త‌గ్గించేసుకుని ఇండ‌స్ట్రీలో ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. లేటు వ‌య‌సులో ఘాటు అందాలు ఎలివేట్ చేస్తూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అవుతున్నారు. మ‌రి ఆ జాబితాలో సోన‌మ్ బ‌జ్వా కూడా ఉందో ఏమో అంటూ నెటి జ‌నులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.