Begin typing your search above and press return to search.

సుశాంత్ తో సోనమ్ చిందులు..

By:  Tupaki Desk   |   8 Oct 2015 9:30 AM GMT
సుశాంత్ తో సోనమ్ చిందులు..
X
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా టర్న్ ఇచ్చుకుని అదృష్టం పరీక్షించుకుంటోంది సోనమ్ బజ్వా. ఈ భామ త్వరలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ బ్యూటీ పంజాబీ మూవీ బెస్ట్ ఆఫ్ లక్ తో ఫిలిం ఇండస్ట్రీలో ప్రవేశించింది. ఈమెకు ఇప్పటివరకూ బాలీవుడ్ ఎంట్రన్స్ దొరకలేదు కానీ.. సౌత్ లో మాత్రం ప్రవేశించింది.

ఇప్పటికే తమిళ్ మూవీ కప్పల్ లో యాక్ట్ చేసింది. పాండవుల్లో ఒక్కడు పేరుతో ఈ మూవీ తెలుగులోకి కూడా డబ్ అవుతోంది. ఇప్పుడీ సోనమ్ బజ్వాను టాలీవుడ్ లోకి దించుతున్నారు. సుశాంత్ హీరోగా జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో తీయబోతున్న చిత్రానికి ఈ మోడల్ కం హీరోయిన్ ముద్దుగుమ్మని సెలక్ట్ చేసుకున్నారట. ఇది పక్కా లవ్ ఎంటర్ టెయినర్ కావడంతో.. ఫ్రెష్ పెయిర్ కోసం చాలా ట్రై చేశారట మేకర్స్.

అనేకమందిని ఆడిషన్ చేసి చివరకు సోనమ్ బజ్వాకు సెట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన డీటైల్స్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. టాలీవుడ్ లో మరో ఉత్తరాది నాయిక అదృష్టం పరీక్షించుకోబోతోంది. బెస్టాఫ్ లక్ సోనమ్..