Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: కట్టిండే.. వైఫ్ షూలేస్ కట్టిండే!
By: Tupaki Desk | 19 April 2019 12:14 PM GMTబాలీవుడ్ లో పోయినేడాది సింగిల్ స్టేటస్ కు ఫుల్ స్టాప్ పెట్టి వివాహ బంధంలో అడుగుపెట్టిన వారిలో సోనమ్ కపూర్ - ఆనంద్ ఆహూజా జంట ఒకటి. వచ్చే నెల ఎనిమిదో తారీఖున ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవం చేసుకోబోతున్నారు. అయితే సోనమ్-ఆనంద్ లకు ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడూ మనసులోనే ఉండదు.. ఒక్కోసారి తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అలా ఒకసారి షాప్ బయట సోనమ్ ను గాల్లోకి ఎత్తి ఒక కిస్సిచ్చాడు అహూజా. ఎన్నోసార్లు ఈ జంట తమ ప్రేమను బహిరంగంగానే వ్యక్తపరుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి సందర్భమే వచ్చింది.
రీసెంట్ గా ఈ జంట ఒక స్టోర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అహూజా నలుపు రంగు దుస్తుల్లోనూ.. మిసెస్ అహూజా మెంతిరంగు గౌన్ లోనూ చిలకాగోరింకల లాగా కనిపించారు. కనిపించడమే కాదు.. మేము చిలకా గోరింకలమే అన్నట్టుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సోనమ్ ధరించిన షూ లేస్ ఊడిపోయింది. అంటే భర్త గారు క్షణమైనా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయి కిందకు ఒంగి ప్రియమైన భార్యామణి షూ లేసును కట్టారు. సతీమణి సోనమ్ ఆ సంఘటనతో సిగ్గుల మొగ్గ అయింది. ఇంట్లో నాలుగు గోడల మధ్య అయితే సరే కానీ.. కెమెరా కంట్లో సోషల్ మీడియా ఇంట్లో కాబట్టి ఇది చాలా సంచలనాత్మకమైన చర్య అనడం లో ఏమాత్రం సందేహం లేదు. ఎవరు ఎన్ని మొత్తుకున్నా మనది పురుషాధిక్య సమాజం. భార్య షూ లేసులను ఇలా కట్టడాన్ని చాలామంది ఒప్పుకోరు. కానీ సోషల్ మీడియాలో ఈ ఫోటోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. క్యూట్ కపుల్ అని.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కామెంట్ చేస్తున్నారు. సోనమ్ - ఆనంద్ కపుల్ మధ్య ఉన్న ఆకాశమంత ప్రేమ ఉందని అది ఇలాంటి సంఘటనల ద్వారా వ్యక్తం అవుతోందని అంటున్నారు.
ఇదే ఫోటో స్టొరీ కనుక రివర్స్ లో జరిగి అహూజా షూ లేస్ కనుక సోనమ్ కట్టి ఉంటే ఏమై ఉండేది? పురుషాధిక్య సమాజం అని.. ఆయిల్ లేకుండా పుల్కాలు కాల్చే సొసైటీ అని అర్థం పర్థం లేని లాజిక్కులతో ఆహూజాను ఏకిపారేసేవారు.. ఆడిపోసుకునేవారు. ఇవే మన డబల్ స్టాండర్డ్స్!