Begin typing your search above and press return to search.

లవ్వర్ గురించి బయటకు చెప్పేసింది

By:  Tupaki Desk   |   17 Jan 2017 10:30 PM GMT
లవ్వర్ గురించి బయటకు చెప్పేసింది
X
బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నా.. సోనమ్ కపూర్ దారి కాస్త వేరు. సెలెక్టివ్ గా సినిమాలు చేయటంతో ఆమె తీరు భిన్నంగాఉంటుంది. ప్రముఖ హీరో అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ఒకట్రెండు సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకోవటమే కాదు.. తనకంటూ భారీ ఫ్యాన్ మొయిల్ ను సంపాదించుకుందని చెప్పాలి.

తాజాగా ఒక ప్రముఖ షోలో పాల్గొన్న ఆమె.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చింది. గతంలోనే ఈ పొడుగు భామ ఒక వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తుందన్న మాట వినిపించినా కన్ఫర్మ్ చేసేలా ఎలాంటి ఆధారాలు దొరకని పరిస్థితి ఇదిలా ఉంటే.. షోలో పాల్గొన్న నేపథ్యంలో ప్రియుడి గురించి క్వశ్చన్ ఆమె ముందుకు వచ్చేసింది.

దీంతో.. సమాధానం చెప్పిన సోనమ్.. లండన్ కు చెందిన వ్యాపారవేత్తతో తాను డేటింగ్ చేస్తున్నట్లుగా చెప్పేసింది. అయితే.. ఆ విషయాన్ని అక్కడితోనే వదిలేయాలని.. ఎందుకంటే అది తన పర్సనల్ గా చెప్పుకొచ్చింది. తన వ్యక్తిగత విషయాల్ని చెప్పటం తనకు ఇష్టం లేదని.. ఆ రిలేషన్ కు తాను చాలా వాల్యూ ఇస్తున్నట్లుగా పేర్కొంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. లవ్వర్ గురించి మాత్రం మాట దాటేయకుండా ఓపెన్ గా చెప్పేయటం గ్రేట్ అనే చెప్పాలి. మిగిలిన వారి మాదిరి దొరికిపోయాక కూడా దాచేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం చూసినప్పుడు సోనమ్ తన ప్రత్యేకతను మరోసారి నిలుపుకుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/