Begin typing your search above and press return to search.
కొడుకు పుట్టి వారం కాలేదు... అతని చదువు పై హీరోయిన్ ఆందోళన
By: Tupaki Desk | 25 Aug 2022 1:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇటీవలే కొడుకుకి జన్మనిచ్చిన విషయం తెల్సిందే. మొన్న ఆగస్టు 20వ తారీకున డెలవరీ అయిన సోనమ్ కపూర్ అప్పుడే ప్రముఖ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ మ్యాగజైన్ కవర్ పేజ్ పై ఎక్కిన సోనమ్ తన డెలవరీ సమయంలో ఎదుర్కొన్న సమస్యలను.. ఆనందాలను.. ఆరోగ్య సమస్యలను గురించి చెప్పుకొచ్చింది.
అదే సమయంలో ఆమె తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్లు కూడా పేర్కొంది. ముఖ్యంగా తన కొడుకు చదువు విషయంలో ఏం చేయాలో పాలుపోవడం లేదని సోనమ్ కపూర్ ఆ కవర్ స్టోరీ లో ఆవేదన వ్యక్తం చేసింది. ముంబయి లో అతను ఒక స్టార్ కొడుకు అవ్వడం వల్ల సాధారణ జీవితం ను గడపగలడా.. సాదారణంగా విధ్యను అందుకోగలడా అంటూ తాను ఆలోచిస్తున్నాను అంది.
నా తల్లిదండ్రులు అయిన అనిల్ కపూర్.. సునీత కపూర్ లు నన్ను నా సోదరి మరియు సోదరుడి యొక్క బాల్యం ను చాలా గోప్యంగా ఉంచి జనాల దృష్టిలో పడకుండా పెంచారు. ఒక సాదారణ స్కూల్ కు వెళ్లిన నేను అక్కడ ఒక్క స్టార్ కిడ్ కూడా లేకపోవడంతో అందరితో సాదారణంగా కలిసి పోయాను. ఒక సామాన్యమైన జీవనం గడపడం వల్ల మా బాల్యం అద్భుతంగా సాగింది.
ఇప్పుడు అలాంటి బాల్యం ను నా కొడుకుకి ఇవ్వగలనా అనే అనుమానం కలుగుతోంది. నిజం చెప్పాలంటే నా కొడుకును ఇండియాలో చదివించాలా లేదా లండన్ లో చదివించాలా అనే విషయమై నేను ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాను. ఇండియాలో ఉంటే అతడు నా ఇంట్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ సాధారణ విద్యాబ్యాసం సాధ్యమా అనేది నాకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు.
కొడుకు పుట్టి వారం కూడా కాకుండానే సోనమ్ కపూర్ కు ఎంత పెద్ద కష్టం వచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలోని ఎంతో మంది సెలబ్రిటీ పిల్లలు సామాన్యుల మాదిరిగా ఐడెంటిటీ ని దాచి వేసి చదువుకుంటున్నారు.
అలా నీ కొడుకును కూడా చదివించవచ్చు.. ఆందోళన అక్కర్లేదు అంటూ కొందరు సోనమ్ కు సోషల్ మీడియా ద్వారా సలహా ఇస్తున్నారు. కాస్త ముందుగానే చాలా పెద్ద విషయాన్ని గురించి సోనమ్ ఆలోచిస్తుంది అంటూ మరి కొందరు ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.