Begin typing your search above and press return to search.
మళ్లీ ధనుష్ జోడీగా ఆ బాలీవుడ్ హాటీ
By: Tupaki Desk | 9 Oct 2016 3:30 PM GMTధనుష్ అంటే ఏంటో బాలీవుడ్ వాళ్లకు.. హిందీ ప్రేక్షకులకు చూపించిన సినిమా ‘రాన్ జానా’. ఈ సినిమా మొదలైనపుడు అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. సోనమ్ కపూర్ కు జోడీగా ధనుష్ ఏంటి అన్నారు. వీళ్లిద్దరికీ అస్సలు జోడీ కుదరన్నారు. కానీ ‘రాన్ జానా’ విడుదలయ్యాక అందరి నోళ్లూ మూతపడ్డాయి. తన పెర్ఫామెన్స్ తో చితగ్గొట్టేశాడు ధనుష్. సోనమ్ కపూర్ తో అతడి కెమిస్ట్రీ కూడా చాలా బాగా పండింది. ఇప్పుడు వీళ్లిద్దరి జోడీ మరోసారి కనువిందు చేయనుందని సమాచారం. ఐతే అది హిందీ సినిమా కాదు.. తమిళంలో తెరకెక్కబోయే సినిమా కావడం విశేషం.
సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కోచ్చడయాన్’ సినిమా రూపొందించిన ఆయన చిన్న కూతురు సౌందర్య.. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టబోతోంది. ఈ సినిమాలో ధనుషే హీరో అని ఇప్పటికే వెల్లడైంది. ఈ చిత్రంలో అతడికి జోడీగా సోనమ్ కపూర్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. తన సినిమాను కేవలం తమిళానికే పరిమితం చేయకూడదని భావిస్తోంది సౌందర్య. హిందీలోనూ రిలీజ్ చేయాలనుకుంటోంది. అందుకే అక్కడి వాళ్లకు కూడా పరిచయమున్న సోనమ్ కపూర్ ను ధనుష్ కు జోడీగా తీసుకుందట సోనమ్. రజినీతో ‘కబాలి’ సినిమాను నిర్మించిన కలైపులి థాను ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతుండటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/