Begin typing your search above and press return to search.

అప్పుడు నయన్.. ఇప్పుడు సోనమ్..

By:  Tupaki Desk   |   28 Feb 2018 12:45 PM IST
అప్పుడు నయన్.. ఇప్పుడు సోనమ్..
X
అందరిలనే సినిమా తారలు కూడా వ్యక్తిగత జీవితంతో హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. కొందరు స్టార్ డమ్ గురించి ఆలోచించి పర్సనల్ విషయాలను చాలా రహస్యంగా ఉంచుకుంటారు. మరికొందరైతే ఎవరు ఏమనుకున్నా పరవలేదు అనేట్లుగా పర్సనల్ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అంటే.. ప్రేమ వ్యవహారలను చాలావరకు తారలు బయటపెట్టుకోరు. కానీ కొంత మంది మాత్రం చెప్పరు గాని చూపించేస్తారు.

ముఖ్యంగా హీరోయిన్స్ ఈ మధ్య బాయ్ ఫ్రెండ్స్ ని మంచి - చెడ్డ కార్యక్రమలకు తీసుకువస్తున్నారు. రీసెంట్ గా శ్రీదేవి దుబాయ్ లో తుది శ్వాసను విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అంతిమ యాత్రలో పాల్గొనడానికి ఇప్పటికే బాలీవుడ్ తారలోకం ముంబైకి చేరుకుంది. సీనియర్ నటీనటులతో పాటు యువ తారాగణం కూడా శ్రీదేవి చివరి చూపుకోసం తరలి వస్తున్నారు. అయితే సోనమ్ కపూర్ శ్రీదేవి అంతిమ యాత్రకు తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకువచ్చింది. సోనమ్ గత కొన్ని రోజులుగా ఆనంద్ ఆహుజా ని తన ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ కి కూడా తీసుకువస్తోంది. ఇంట్లో వారు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే శ్రీదేవి పార్థివ దేహాన్ని ఈ జంట ఎలా అయితే చూడ్డానికి వచ్చిందో గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివ దేహాన్ని చూడటానికి నయనతార కూడా తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చింది. దర్శకుడు విగ్నేష్ తో నయన గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే.