Begin typing your search above and press return to search.

కొత్త జంట రొమాంటిక్ ప్రేమ

By:  Tupaki Desk   |   11 May 2018 6:17 AM GMT
కొత్త జంట రొమాంటిక్ ప్రేమ
X
బాలీవుడ్ లో ఏ సెలబ్రెటీ పెళ్లి జరిగినా కూడా ఆ హడావిడి మాములుగా ఉండదు. ఓ నెలైన హంగామా కనిపించాల్సిందే. వెడ్డింగ్ వేడుకలే వారంకి పైగా ఉంటాయి. పెళ్లి తరువాత రిసెప్షన్ అని సెలబ్రెటీ పార్టీ అని చాలా బిజీ అవుతుంటారు. జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుకను అదే తరహాలో చేసుకోవాలని ఎవ్వరైనా అనుకుంటారు. ఇటీవల ఓ ముద్దుగుమ్మ కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంటోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో ఆనందం గురించి తెలిసేలా ఫొటోల ద్వారా చెబుతోంది.

ఆమె ఎవరో కాదు. కూల్ బ్యూటీ సోనమ్ కపూర్. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా అల్లరి పిల్లగా కనిపించే సోనమ్ తన పెళ్లిని సింపుల్ గా కానిచ్చేసి మిగతా వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇటీవల ముగిసిన వీరి వివాహ వేడుకల హడావుడి ఫ్యామిలిలో తగ్గినా కూడా సోషల్ మీడియాలో మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. దానికి తోడు కొన్ని స్పెషల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటుండంతో కొత్త జంట ఇంకా పాపులర్ అవుతోంది.

ఇటీవల సోనమ్ తన భర్త ఆనంద్ అహుజా ని హగ్ చేసుకొని రొమాంటిక్ గా ఉన్న ఫొటో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోనమ్ కనిపించిన తీరులో ప్రేమ చాలానే కనిపిస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో ఈ జంట హనీమూన్ ప్లాన్స్ వేసుకుంది. కొన్ని రోజులు హ్యాపీగా గడిపిన తరువాత మళ్లీ యధావిధిగా ఎవరి పనుల్లో వారు బిజీ కానున్నారు.