Begin typing your search above and press return to search.
రీమేక్ గురించి వారికి చెప్పకపోవడం దారుణం
By: Tupaki Desk | 22 Feb 2020 12:30 PM GMTబాలీవుడ్ సూపర్ హిట్ క్లాసిక్ మూవీ ‘మిస్టర్ ఇండియా’ను రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చిన విషయం తెల్సిందే. 1987లో అనీల్ కపూర్.. శ్రీదేవి జంటగా నటించిన మిస్టర్ ఇండియాకు శేఖర్ కపూర్ దర్శకత్వం వహించాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారు. జీ స్టూడియోతో కలిసి జాఫర్ అలీ రీమేక్ ను ప్రకటించారు. అయితే రీమేక్ విషయాన్ని అనీల్ కపూర్ మరియు దర్శకుడు శేఖర్ కపూర్ కు తెలియజేయలేదట.
మిస్టర్ ఇండియా సినిమా రీమేక్ విషయాన్ని అనీల్ కపూర్ కు తెలియజేయక పోవడంపై ఆయన కూతురు హీరోయిన్ సోనమ్ కపూర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయమై ఆమె స్పందిస్తూ ఇది చాలా అవమానకరం. రీమేక్ విషయం నిజం అయితే వెంటనే వారు హీరో మరియు దర్శకుడిని సంప్రదించాలని డిమాండ్ చేసింది. ఆ సినిమా మానాన్నకు చాలా స్పెషల్. అది ఒక సినిమా మాత్రమే కాకుండా అది ఒక సెంటిమెంట్. ఆయన వారసత్వ సంపద అయిన ఆ సినిమా రీమేక్ కు కనీసం ఆయన్ను సంప్రదించక పోవడం దారుణం అంది.
దర్శకుడు శేఖర్ కపూర్ కూడా రీమేక్ విషయమై తనను సంప్రదించలేదు అన్నాడు. టైటిల్ తో క్యాష్ చేసుకునేందుకు వారు ప్రయత్నించవచ్చు. కాని అందులోని పాత్రలను కొనసాగించేందుకు మాత్రం ఖచ్చితంగా మా పర్మిషన్ కావాలంటూ ఆయన అన్నాడు. ఇప్పటికైనా మిస్టర్ ఇండియా రీమేక్ మేకర్స్ అనీల్ కపూర్ మరియు శేఖర్ కపూర్ లతో చర్చలు జరిపి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే మంచిది అంటూ బాలీవుడ్ వర్గాల వారు సలహా ఇస్తున్నారు.