Begin typing your search above and press return to search.

కేన్స్ లో ఇండియన్ కిక్కిచ్చిందిగా

By:  Tupaki Desk   |   21 May 2017 9:35 AM GMT
కేన్స్ లో ఇండియన్ కిక్కిచ్చిందిగా
X
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో చాలామంది సుందరాంగులే హొయలు ఒలికించారు. భారతీయ ముద్దుగుమ్మలు కూడా అల్ట్రా మోడర్న్ డ్రెస్సులతో వేడెక్కించారు. దీపికా పదుకొనే.. ఐశ్వర్యారాయ్.. మల్లికా షెరావత్.. శృతి హాసన్.. ఇలా భారతీయ భామలందరూ వెస్ట్రన్ వేర్ తోనే సందడి చేశారు.

కానీ వీరందరికీ భిన్నంగా వ్యవహరించింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. ఇక్కడ అల్ట్రామోడర్న్ డ్రెస్సులతో.. అబ్బురపరిచే క్లీవేజ్ షోతో హంగామా చేసే ఈ సుందరి.. కేన్స్ కి మాత్రం భారతీయ సాంప్రదాయ వస్త్రధారణను చూపించింది. చీరకట్టులో తనదైన స్టైల్ ను ప్రదర్శించి.. ఆశ్చర్యపరిచింది. ఇందులో కూడా గ్లామర్ ఉన్నా.. మొత్తం మీద ఇండియన్ వేర్ కే ప్రాధాన్యత ఇచ్చింది సోనమ్ కపూర్. వైట్ కలర్ ఇన్నర్ టాప్.. దానిపైన ట్రాన్స్ పరెంట్ టాప్.. పవిట వెనక నుంచి ముందుకు వచ్చేలా కట్టిన మల్టీ కలర్ శారీతో సోనమ్ చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది.

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ డ్రెసింగ్ తో ఇరగదీసిన భామ సోనమ్ ఒక్కతే కావడం విశేషం. ఏ దేశమేగినా.. మొదట భారతీయతకే ఇంపార్టెన్స్ అని.. ఆ తర్వాతే ఫారిన్ కిక్ అంటూ చెప్పకనే చెప్పింది సోనమ్ కపూర్. కేన్స్ ఈవెంట్ మొత్తానికి సోనమ్ డ్రెసింగ్ స్పెషల్ గా కనిపించడానికి ఈ ఇండియన్ టచ్ కారణమైంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/