Begin typing your search above and press return to search.

ప్యూర్ గోల్డులో పుత్తడి బొమ్మలా..

By:  Tupaki Desk   |   23 May 2017 4:27 AM GMT
ప్యూర్ గోల్డులో పుత్తడి బొమ్మలా..
X
గడియ గడియకో డ్రస్సు.. ఘాటైన డ్రస్సు.. అన్నట్లుంది సెక్సిణీ సోనమ్ కపూర్ పరిస్థితి. నిజానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ తరువాత ఇండియా నుండి అంత క్రేజ్ సంపాదించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా మనం సోనమ్ పేరే చెప్పుకోవాలి. అమ్మడు తన క్లీవేజ్ సోకులతో ఎప్పటికప్పుడు మతిపోగొట్టేస్తోందక్కడ!!

నిజానికి తొలి రోజున ఇండియన్ లుక్ లో ఎంతో సాంప్రదాయబద్దమైన అందాలను ఆరబోసిన సోనమ్.. 2వ రోజు నుండి మాత్రం కాస్త హీటెక్కించడం స్టార్ట్ చేసింది. మామూలుగా రేంజులో కాదనుకోండి. డీప్ క్లీవేజ్ కనిపించేలా.. తన ఒంపుసొంపులన్నీ తెలిసేలా.. అమ్మడి లుక్ కేకలు పెట్టించింది. ఇప్పుడు మరోసారి ఒక గోల్డు రంగు గౌనులో.. పుత్తడి బొమ్మలా అమ్మడు రెచ్చిపోయింది. చూస్తున్నారుగా.. స్వచ్చమైన గోల్డుతో చేసినట్లున్న సదరు గౌను ధరించి.. ఆ డీప్ కట్ నెక్ ఒకటి అలంకరణ టైపులో విరబూయిస్తూ.. ఇక తన ప్రాయాలను అలా అలా హొయలు వలికించింది.

మొత్తానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే చాలు.. మనోళ్ళు లైన్లో నుంచొని మరీ క్లీవేజ్ అందాలను దారబోస్తున్నారు. కానివ్వండి. గ్లామర్ మాత్రమే రాజ్యమేలుతున్న చోట.. మీరు మాత్రం ఎలా కామ్ గా ఉంటారు.