Begin typing your search above and press return to search.

సోనమ్ నువ్వు సూపర్ అంతే

By:  Tupaki Desk   |   6 March 2018 4:21 AM GMT
సోనమ్ నువ్వు సూపర్ అంతే
X
జీవితంలో అనుకోని విషాదం ఎదురైనప్పుడు ఓదార్పునిచ్చేది.. ఊరటనిచ్చేది అయినవారి అండదండలు.. అభిమానమే. ఈ ఫీలింగ్ సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకు ఎవరికైనా ఒకటే. అయినవాళ్లను పోగొట్టుకోవడం.. అందునా జీవితంలో అన్నీ తానయి పెంచి పెద్ద చేసి నడిపించిన తల్లిని పోగొట్టుకోవడం అంటే తేరుకోలేని విషాదమే. అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో అందరికన్నా ఎక్కువ కుంగిపోయింది కచ్చితంగా ఆమె కూతుళ్లు జాన్వి.. ఖుషీలే.

పాత గొడవలన్నీ పక్కనపెట్టి అమ్మను పోగొట్టుకున్న జాన్వి.. ఖుషీలకు బోనీకపూర్ కుమారుడు.. హీరో అర్జున్ కపూర్ అండగా నిలిచాడు. తల్లిని పోగొట్టుకున్న అతి కొద్ది రోజుల్లోనే జాన్వి పుట్టినరోజు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె పుట్టిన రోజు సెల్రబేట్ చేసుకోలేదు. అయినా ఆమెకు ఊరటనిచ్చేలా.. స్ఫూర్తి పెంచే జాన్వి అక్క.. అనిల్ కపూర్ ట్వీట్ తో బర్త్ డే విషెస్ చెప్పింది. ‘‘నాకు తెలిసిన అత్యంత శక్తివంతులైన అమ్మాయిల్లో ఒకరు ఇవాళ మహిళగా ఎదిగింది. హ్యాపీ బర్త్ డే జాను’’ అంటూ చెల్లి 21వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పింది.

కరెక్ట్ గా 12 గంటల వేళ గుర్తుపెట్టుకుని శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. కష్టంలో ఉన్న చెల్లెలికి ఎలాంటి మాటలు చెబితే ఓదార్పు లభిస్తుందో అదే చెప్పి అక్కగా నూటికి నూరు మార్కులు సంపాదించుకుంది సోనమ్ కపూర్.