Begin typing your search above and press return to search.

మితిమీరిన ఎక్స్ పోజింగ్.. తప్పు ఫోటోగ్రాఫర్లదే

By:  Tupaki Desk   |   5 March 2017 7:33 AM GMT
మితిమీరిన ఎక్స్ పోజింగ్.. తప్పు ఫోటోగ్రాఫర్లదే
X
అందాల విందు అందరు భామలు చేస్తుంటారు కానీ.. ఆఫ్ స్క్రీన్ లో అదరగొట్టేసే బ్యూటీల విషయంలో మాత్రం సోనమ్ కపూర్ తర్వాతే ఎవరైనా. రీసెంట్ గా ఓ ప్రైవేటు ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన ఈ బ్యూటీ.. ఓ బ్లాక్ కలర్ లాంగ్ డ్రెస్ ను వేసుకొచ్చింది. ముందు నుంచి క్లీవేజ్ షోకులతో పాటు.. సైడ్ యాంగిల్ నుంచి కూడా తన వయ్యారాల మెరుపులను చూపించేసింది. మితిమీరి ఎక్స్ పోజింగ్ చేసింది.

ఇదే ఇప్పుడు బోలెడన్ని విమర్శలకు దారి తీస్తోంది. సోనమ్ కపూర్ డ్రెస్ చాలా అసభ్యంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. మరీ శృతి మించిపోయిందని.. వల్గర్ గా ఉందంటూ బోలెడన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటన్నిటినీ తీరిగ్గా విన్న సోనమ్.. ఇప్పుడు తన స్టైల్ లో రిటార్ట్ ఇచ్చింది. 'నాన్సెన్స్.. ఫోటోగ్రాఫర్లు తమ లిమిట్స్ దాటి ఇలా నా ఫోటోలను వారిష్టం వచ్చినట్లు తీశారు. ఈ విషయంలో నాదేం తప్పు లేదు. నా శరీరాన్ని.. శరీరంలో ప్రతీ భాగాన్ని చూసి నేను గర్విస్తున్నా' అని చెప్పింది సోనమ్.

తన డ్రస్సు లెంగ్త్ ను చూసి తనను అంచనా వేయలేరంటూ రీసెంట్ గా సెలవిచ్చిన సోనమ్.. ఇప్పుడు తన శరీరం.. డ్రెసింగ్ విషయంలో ఇలా సమర్ధించేసుకోవడంలో పెద్ద విచిత్రమేమీ లేదులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/