Begin typing your search above and press return to search.

సోనమ్ రియాక్ట్ అవడమే హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   11 April 2017 8:03 AM GMT
సోనమ్ రియాక్ట్ అవడమే హాట్ టాపిక్
X
తాజాగా 64 వ జాతీయ ఫిలిం అవార్డులను ప్రకటించారు. ఇందులో నీర్జా మూవీకి గాను.. సోనమ్ కపూర్ కు స్పెషల్ మెన్షన్ కేటగిరీలో అవార్డ్ అనౌన్స్ చేశారు. ఆ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ ప్రదర్శించిన నటనా ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. అయితే.. దీనిపై సోనమ్ కపూర్ లవర్ గా గుర్తింపు పొందిన ఆనంద్ అహూజా రియాక్ట్ అయ్యాడు. నిజానికి ఇతని పోస్ట్ కంటే.. దీనికి సోనమ్ రియాక్ట్ అవడమే హాట్ టాపిక్ అయింది.

సోనమ్ కపూర్- ఆనంద్ అహూజా ప్రేమలో ఉన్నారనే ప్రచారం చాలాకాలంగానే ఉంది. ఇద్దరూ కలిసి చక్కర్లు కొడుతూ కెమేరాలకు చిక్కారు కానీ.. డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవడం ఇప్పటివరకూ జరగలేదు. నీర్జా మూవీ పోస్టర్ ను పోస్ట్ చేసిన ఆనంద్ అహూజా.. 'జీవితం అంటే నీ బహుమతిని నువ్వే వెతుక్కోవడమే' టైపు వేదాంతంతో పాటు.. తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ స్థాయి అందుకోవడానికి కారణం అన్నాడు. చివరలో 'ప్రతీ రోజూ అత్యద్భుతమే' అనే అర్ధం వచ్చేలా ఓ హ్యాష్ ట్యాగ్ తగిలించాడు.

దీనికి రిప్లై ఇచ్చిన సోనమ్ కపూర్.. 'ప్రతీ రోజూ అత్యద్భుతం ఎందుకంటే' అని రాసి.. ఓ లవ్ సింబల్ ను కూడా పోస్ట్ చేసింది. అంతే.. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారాన్ని ఇలా ఇన్ డైరెక్టుగా సోనమ్ చెప్పిందంటూ మీడియాలో హంగామా స్టార్ట్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/