Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సోనమ్ కూడా అలానే

By:  Tupaki Desk   |   15 May 2018 5:17 AM GMT
ఫోటో స్టోరి: సోనమ్ కూడా అలానే
X
పెళ్లి జరిగిందంటే చాలు హీరోయిన్స్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది అని గత కొంత కాలం వరకు టాక్ బాగా వచ్చేది. కానీ ఇప్పుడున్న ముద్దుగుమ్మలు మాత్రం వారి ప్రవర్తనతో ఆ మాటలకు చెక్ పెడుతున్నారు. ఎంతగా అంటే మరోసారి పెళ్లి మాట ఎవరికీ గుర్తుకు రాకుండా చేస్తున్నారు.. అందానికి వివాహానికి అసలు సంబంధం లేదని వారి ఇస్తున్న ఫోజులు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణగా బాలీవుడ్ భామలు చాలా మంది ఉన్నారు.

ఇక రీసెంట్ గా ఆ జాబితాలో సోనమ్ కపూర్ కూడా చేరిపోయింది. అమ్మడు ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు పెళ్లి సంబరాలతో ఈ బ్యూటీ చాలా ఆనందంగా గడిపింది. ఇక ఆ పనులు పూర్తయ్యే సరికి తన రెగ్యులర్ ఫ్యాషన్ జీవితంలోకి అడుగుపెట్టింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై సోనమ్ నడిచిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.

ఆమె డ్రెస్ చూసి ప్రతి ఒక్కరు ఆకర్షితులు అయ్యారు. పైగా క్లివేజ్ షోతో ఎవరు ఊహించని విధంగా కనిపించి ఇంకా 20 ఏళ్ల అమ్మాయిలనే ఉందని టాక్ తెచ్చుకుంది. ఆమె సెక్సీ అందాలకు ప్రస్తుత, సోషల్ మీడియాలో కూడా అనేక ప్రశంసలు అందుతున్నాయి. సోనమ్ పెళ్లయినా కూడా ఏ మాత్రం మారలేదు అని చెబుతున్నారు. రీసెంట్ గా ఐశ్యర్య రాయ్ - మల్లికా శరావత్ - హ్యూమా ఖురేషి కూడా అదే లెవల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.