Begin typing your search above and press return to search.

ఇలియానా పేరు ​కూతురు నేర్పిందట

By:  Tupaki Desk   |   24 Jun 2017 9:39 AM GMT
ఇలియానా పేరు ​కూతురు నేర్పిందట
X
మన ప్రాంతపు పేర్లు మనకు కొత్తగా ఉండవు, మనుషులు పేర్లు కూడా మనకు అర్ధమైనట్లుగానే ఉంటాయి. కానీ మనకు సంబంధం కానీ ప్రాంతపు పేర్లు మొదటిసారి విన్నప్పుడు పలికినప్పుడు ఖచ్చితంగా తప్పుగానే పలుకుతాము కదా. ఒక సూపర్ స్టార్ కూడా ఇక్కడ ఒక పేరు తప్పుగా పలికాడు. ఆ పక్కనే ఉన్న అతని కూతురు దాన్ని ఎలా పలకాలో చెప్పి నేర్పించిందట. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కు తనతో పని చేసే ఒక హీరోయిన్ పేరు పలకడం రాకపోతే కూతురు సోనమ్ కపూర్ ఎలా పలకాలో చెప్పిందట.

అనిల్ కపూర్ ‘ముబారకన్’ అనే హింది సినిమాలో తొలిసారిగా నడుం సుందరి ఇలియానా డిక్రూజ్ తో కలిసి పనిచేస్తున్నాడు. అనిల్ సోనమ్ మాటలమధ్యలో అనిల్ ఇలియానా పేరును ‘ఇలానా’ అని పలికాడు అంటా. దానితో సోనమ్ కొంచం హడలిపోయి నాన్న నీకు ఏమైందసలు.. అంత తప్పుగా పేరు ఎలా పలుకుతావు అని చెప్పి కరెక్ట్ చేసిందీ కూతురు. ఆ తరువాత అనిల్ సెట్ లోకి వెళ్ళి ఇలియానా ను పిలిచి మళ్ళీ ఇలియానా అని పర్ఫెక్ట్ గా పలికాడట. దాని తో ఇతనికి ఎలా కరెక్ట్ గా తన పేరు పలకడం వచ్చిందని ఇలియానా ఆశ్చర్యపోయింది.

అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న ముబారకన్ సినిమాలో ఇలియానా, అతియా శెట్టి హిరోయిన్లు గా నటిస్తున్నారు. బాబాయ్ అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు. ఈ సినిమాను అనీస్ బజ్మీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ రెండు పాత్రలలో కనిపించనున్నాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/